యుద్ధానికి సిద్ధమవుతున్న చైనా?

యుద్ధానికి సిద్ధమవుతున్న చైనా?

పాకిస్తాన్ పక్షం వహిస్తూ.. నిత్యం సరిహద్దుల్లో మనతో కయ్యానికి కాలు దువ్వే చైనా తన ఆయుధాలను పరీక్షిస్తోంది. దీంతో చైనా యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే... చైనా ఎందుకిలా చేస్తోంది... ఎవరితో యుద్ధం చేయాలనుకుంటోంది.. లేదంటే తనతో ఎవరైనా యుద్ధానికి రావొచ్చన్న ఆందోళనతో ఇలా పరీక్షిస్తుందా అన్నది అంతుచిక్కడం లేదు.     

చైనా తన కీలక ఆయుధాలను టెస్ట్ చేస్తోంది. ఇటీవలే మూడు హైపర్‌సోనిక్ ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్స్‌ను పరీక్షించించిందని చైనా మీడియా ప్రకటించడమే దీనికి నిదర్శనం. ఈ హైపర్‌సోనిక్ విమానాలను ఈనెల 21న జిక్యువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్‌లో పరీక్షించిన సీసీటీవీ ఫుటేజీలను చైనా మీడియా బయట ప్రపంచానికి వెల్లడించింది. డీ18-1ఎస్, డీ18-2ఎస్, డీ18-3ఎస్ అనే మూడు రకాలైన హైపర్‌సోనిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది. ఈ రకం విమానాలను నేలపైనుంచే ఆపరేట్ చేయొచ్చు. ఇవి అణ్వస్త్రాలను కూడా మోసుకు వెళ్లగలవు.  ఎలాంటి లక్ష్యాన్నయినా ఛేదించే ఈ హైపర్‌సోనిక్ విమానాలను అడ్డుకోవడం శత్రుదేశాలకు చాలా కష్టం.

 కాగా, గత నెల చైనా సైంటిస్టులు స్టారీ స్కై-2 పేరుగల ఒక సైపర్‌సోనిక్ గ్లైడర్‌ను సమర్థంగా పరీక్షించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, ఎయిర్‌క్రాఫ్ట్‌ల శక్తి సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ విమానాలు, శబ్ద వేగానికి సుమారు ఆరు రెట్లు వేగంతో, అంటే గంటకు 7,344 కిలోమీటర్ల వేగంతో దూసుకెళతా యి. లక్ష్యాలకు అత్యంత సమీపానికి వెళ్లి, ఆయుధాలను ప్రయోగిస్తాయి. ఇంతటి అత్యాధునిక హైపర్‌సోనిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను చైనా పరీక్షించడం ఎవరితోనైనా, ఎప్పుడైనా తాము యుద్ధానికి సిద్ధమే అని చెప్పడానికేనని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English