సికింద్రాబాద్ నుంచి మోదీ పోటీ?

సికింద్రాబాద్ నుంచి మోదీ పోటీ?

వచ్చే ఎన్నికల్లో ప్రధాన నరేంద్ర మోదీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో పోటీ చేసి ఇక్కడ పార్టీ గాలి వీచేలా వాతావరణాన్ని మార్చే అవకాశముందన్న వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది.

దీనిపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉందో ఏమో కానీ బీజేపీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాత్ర మోదీని తన నియోజకవర్గం నుంచి పోటీచేయమని ఆహ్వానించారు. అవును... సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బండారు దత్తాత్రేయ ఆహ్వానించినట్లు బీజేపీలో వినిపిస్తోంది.

దత్తాత్రేయ ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసినప్పుడు ఈ ప్రతిపాదన చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేయటం వలన మొత్తం దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలపై ప్రభావం పడుతుంది.. పార్టీకి బాగా కలిసి వస్తుందని దత్తాత్రేయ వాదిస్తున్నట్లు తెలిసింది. కాగా దత్తన్న అభిప్రాయానికి తెలంగాణ బీజేపీలోనూ మద్దతు దొరికిందని సమాచారం.

పీవీ నరసింహరావు తరువాత ఇంకే ప్రధానీ దక్షిణాది రాష్ట్రాల నుంచి పోటీ చేయలేదు. ఆయన ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత నంద్యాల నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు గతంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తెలంగాణలోని మెదక్, కర్నాటకలోని చిక్‌మంగళూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు.

అయితే... గతఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిపెట్టిన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు బీజేపీకి అంత అనుకూలంగా లేకపోవడంతో మోదీ అక్కడి నుంచే పోటీ చేసి పరిస్థితులను బీజేపీ అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నించొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఒడిశాలోని పూరీ నుంచి కూడా మోదీ పోటీచేయొచ్చని చాలాకాలంగా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English