ఆ బూతులెందుకు దొరా?

ఆ బూతులెందుకు దొరా?

టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ 'చంద్రబాబు 'ఉ..' కూడా పొయ్యర' ని విపరీత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా ఉంది. తెలుగుదేశం నేతలు, కెసిఆర్‌ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కెసిఆర్‌ వ్యక్తిగత విమర్శలు, బూతులు తిడితే సహించేది లేదని హెచ్చరించారు తెలుగు తమ్ముళ్ళు.

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించిన కేసీఆర్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెదేపా నేత నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. తెలంగాణ సంక్షేమం కోసం కేసీఆర్‌ చేసిందేమిటో చెప్పాలన్నారాయన. మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్‌రెడ్డి వంటి తెదేపా నేతలు కెసిఆర్‌ తీరును గర్హించారు.

కెసిఆర్‌పై టిడిపి ఎదురుదాడి అటుంచితే, పార్లమెంటు సభ్యుడిగా, సీనియర్‌ రాజకీయ నాయకుడిగా, ఓ పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్‌ నోటిని అదుపులో పెట్టుకోవడం మంచిది. యువతరం రాజకీయాలపై అసహ్యం పెంచుకుంటోంటే, కెసిఆర్‌ లాంటివారు బూతులు మాట్లాడి ఆ ఆసహ్యం ఇంకా పెరిగేలా చేయడం మంచిది కాదు. విజ్ఞత ఉన్నవారెవరూ నోరు పారేసుకోరు, నోటిని అదుపులోపెట్టుకుంటారు. కెసిఆర్‌ విజ్ఞడనిపించుకోవాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు