ఆయ‌న్ను ఎదుర్కునేందుకు హ‌రీశ్‌ను దింపిన కేసీఆర్‌

ఆయ‌న్ను ఎదుర్కునేందుకు హ‌రీశ్‌ను దింపిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రస‌మితిలో నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న వార‌సత్వ పోరులో...గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ మేన‌ల్లుడైన హ‌రీశ్‌రావు ర‌గిలిపోతున్నాడని, ఇప్పుడే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటే మేల‌ని ఆయన ప్ర‌క‌టించ‌డం వెనుక కార‌ణం ఇదేన‌ని వ‌చ్చిన వార్త‌లు..దానికి అదేమీ లేద‌ని హ‌రీశ్ రావు కొట్టిపారేసిన ఉదంతం..ఎంతో ఆస‌క్తిని స‌హ‌జంగానే సృష్టించింది. అయితే, ఇప్పుడు ఆ వివాదం స‌ద్దుమ‌ణిగిన‌ట్లు క‌నిపిస్తోంది. ఎందుకంటే...త‌మ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్‌నే తిరిగి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ న‌మ్ముకున్నారు. త‌న‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్న రేవంత్ రెడ్డిని ఎదుర్కునేందుకు హ‌రీశ్‌రావును కేసీఆర్ రంగంలోకి దింపారు. రేవంత్‌కు షాకిచ్చేలా తాజాగా చేరిక‌ల‌ను హ‌రీశ్ స‌మ‌క్షంలో కేసీఆర్ ప్రోత్స‌హించారు.

ఎమ్మెల్యేగా అసెంబ్లీ ర‌ద్ద‌య్యే వ‌ర‌కు ప్రాతినిధ్యం వ‌హించిన కొడంగ‌ల్‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ, కాంగ్రెస్ నేతలు అపధర్మ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్య‌క్ర‌మానికి వేదిక అయింది సాక్షాత్తు టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య‌మైన తెలంగాణభవన్! ఈ సంద‌ర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నేత‌ గుర్నాథ‌రెడ్డి హాజ‌ర‌య్యారు. అయితే ఈ చేరిక‌ల‌కు హ‌రీశ్ నాయ‌క‌త్వం వ‌హించ‌డం...అదికూడా పార్టీ కార్యాల‌యం కేంద్రంగా జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొడంగల్ నేత‌ల చేరికల సంద‌ర్భంగా హ‌రీశ్ రావు మాట్లాడుతూ కొడంగల్ లో మొన్నటి దాకా ఉన్న ఎమ్మెల్యేకు మాటలు ఎక్కువ....చేతలు తక్కువ అని రేవంత్ రెడ్డి హ‌రీశ్‌రావు ఎద్దేవా చేశారు. నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కొడంగల్‌లో దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలని కోరారు.కొడంగల్ కు పాలమూరు పథకం ద్వారా నీళ్లు తీసుకువస్తామ‌ని హామీ ఇచ్చారు.

తెలంగాణ సాధకులకు....తెలంగాణ ద్రోహులకు మధ్య జరగబోతున్నాయని హ‌రీశ్‌రావు చెప్పారు. రాష్ట్రంలో పార్టీలన్నీ అవకాశవాదంతో ఒక్కటవుతున్నాయని, ఒక్క దెబ్బతో నాలుగు పార్టీలకు బుద్ధి చెబుదామ‌ని ప్ర‌తిపాదించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని తెలంగాణపై కాంగ్రెస్ వివ‌క్ష చూపిస్తోంద‌న్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేశార‌ని పేర్కొన్నారు. తెలంగాణాకు అడ్డం ప‌డిన టీడీపీతో ఆ పార్టీ పొత్తుపెట్టుకుంటుద‌ని పేర్కొన్నారు. ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డం పడుతున్నాడని, మహబూబ్‌న‌గర్‌కు అన్యాయం చేసింది చంద్రబాబు అని దుమ్మెత్తిపోశారు. సర్వశక్తులు ఒడ్డి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న కోదండరాంకు రైతుల ఉసురు తప్పక తగులుతుంద‌ని హ‌రీశ్ విరుచుకుప‌డ్దారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English