ఆధార్ పైన సుప్రీం సంచ‌ల‌న తీర్పు!

ఆధార్ పైన సుప్రీం సంచ‌ల‌న తీర్పు!

సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ఆధార్ పై ఊహించ‌ని రీతిలో తీర్పును ఇచ్చింది. తాజా తీర్పు నేప‌థ్యంలో బ్యాంకుల్లోనూ... మీ మొబైల్ నెంబ‌ర్ల కోసం ఆధార్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. అంతేకాదు.. స్కూళ్లు.. ప్రైవేటు కంపెనీలు ఆధార్ కోసం ఒత్తిడి చేయ‌కూడ‌ద‌ని పేర్కొంది.

ఒక‌వేళ అలా చేస్తే.. అది నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. యూజీసీ.. నీట్.. సీబీఎస్ ఈ ప‌రీక్ష‌ల‌కు సైతం ఆధార్ లోని 12 అంకెల గుర్తింపు సంఖ్య ఎంత మాత్రం త‌ప్ప‌నిస‌రి కాద‌ని పేర్కొంది. అక్ర‌మంగా వ‌ల‌స వ‌చ్చిన వారికి ఆధార్ ను మంజూరు చేయ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసిన సుప్రీం ధ‌ర్మాస‌నం.. మొబైల్ నంబ‌ర్లు.. బ్యాంకు ఖాతాల‌కు ఆధార్ ను అనుసంధానం చేయ‌టం కూడా ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేసింది.

తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుపై వివిధ అంశాల‌కు సంబంధించి ఆధార్ అనుసంధానం అక్క‌ర్లేద‌ని తేలిపోయిన‌ట్లే. అదే స‌మ‌యంలో ఆధార్ డేటా భ‌ద్ర‌త‌పై అనుమానాలు అవ‌స‌రం లేద‌ని చెప్పింది. ఆధార్ పూర్తి సుర‌క్షిత‌మైన‌ద‌న్న మాట చెప్పిన సుప్రీం.. అట్ట‌డుగు వ‌ర్గాల సాధికారత కోసం ఆధార్ కీల‌క‌పాత్ర పోషిస్తుంద‌ని చెప్పింది.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఆధార్ ను ఇత‌ర కార్డుల మాదిరి డూప్లికేట్ చేయ‌టం కుద‌ర‌ద‌ని చెబుతూ.. ఆధార్ ఉన్న‌త‌మైన‌ద‌నే కంటే కూడా విశిష్ట‌మైన‌ది చెప్ప‌టం స‌మంజ‌సంగా ఉంటుంద‌ని సుప్రీం పేర్కొంది.

డేటా భ‌ద్ర‌త కోసం ప్ర‌భుత్వం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌టిష్ట‌మైన డేటా భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని అమ‌ల్లోకి తేవాల‌ని చెప్పింది. ఆధార్ త‌ప్ప‌నిస‌రి చేయ‌టం వ‌ల్ల రాజ్యాంగం ప్ర‌సాదించిన హ‌క్కుల‌కు భంగం వాటిల్లుతోంద‌ని ఆధార్ పై పిటిష‌న్ దారు వాదించారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌ల అనంత‌రం తాజా తీర్పును వెల్ల‌డించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English