కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న కొండా!

కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న కొండా!

ఊహించిన‌ట్లే జ‌రిగింది. కొండా దంప‌తులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మంగ‌ళ‌వారం నాడు హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్ లో ప్రెస్ మీట్ పెట్టిన కొండా దంప‌తులు ఈ రోజు మ‌ధ్యాహ్నం వేళ‌కు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకొని పార్టీలో చేరారు.

తూటాల్లాంటి మాట‌ల‌తో తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కొండా దంప‌తులు త‌మ‌కు 15 పార్టీల నుంచి ఆహ్వానం అందుతోంద‌ని చెప్పి.. కాంగ్రెస్‌లో చేరారు. దీంతో..వారు మ‌రోసారి కాంగ్రెస్ గూటికి చేరిన‌ట్లైంది. గ‌తంలోనూ పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన వారు.. తాజాగా అధికార టీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్ కు వెళ్లిపోయారు.

పార్టీలోకి వ‌స్తున్న కొండా దంప‌తుల‌కు తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. సీనియ‌ర్ నేత‌లు ష‌బ్బీర్ అలీ.. రేణుకా చౌద‌రి లాంటి నేత‌లు ద‌గ్గ‌ర ఉండి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం మూడు సీట్లు ఆశిస్తున్న కొండా దంప‌తుల‌కు.. ఒక్క సీటును కేటాయించేందుకు మాత్ర‌మే కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం హామీ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. కొండా అందుకు ఓకే అనే కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారా? ఏమో.. ఏదైనా జ‌రిగే అవ‌కాశం ఉన్న కాంగ్రెస్ లో కొండా దంప‌తుల ఆశ‌ల్ని ఎలా నెర‌వేరుస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English