మంత్రుల‌కు చెప్ప‌కుండానే మోడీ రాఫెల్ డీల్?

మంత్రుల‌కు చెప్ప‌కుండానే మోడీ రాఫెల్ డీల్?

సంచ‌ల‌నం సృష్టిస్తున్న రాఫెల్ డీల్ కు సంబంధించి కొత్త కొత్త విష‌యాలు ఇప్పుడు ఒక్కొక్క‌టిగా తెర మీద‌కు వ‌స్తున్నాయి. ఇంత భారీ డీల్ విష‌యంలో మోడీ మ‌హా గుట్టుగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ద‌వీబాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత అదే ప‌నిగా విదేశీ టూర్లు చేసిన సంగ‌తి తెలిసిందే.

త‌న విదేశీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భార‌త దేశ ప్ర‌ధాని ఈ దేశంలో ప‌ర్య‌టించి ఇన్ని సంవ‌త్స‌రాలైంది.. అన్ని సంవ‌త్స‌రాలైంద‌న్న మాట‌తో పాటు.. మోడీ కాబ‌ట్టే ఇంత చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న సందేశాన్ని జాతి జ‌నుల మ‌న‌సుల్లో ముద్రించేలా ప్లాన్ చేయ‌టం క‌నిపిస్తుంది. ఈ ఫారిన్ టూర్ల హ‌డావుడిలోనే రాఫెల్ ఎపిసోడ్ కూడా జ‌రిగిన‌ట్లుగా అనుమానిస్తున్నారు.

2015లో మోడీ ఫ్రాన్స్ కు వెళ్లిన‌ప్పుడు రాఫెల్ అంశంపై భార‌త ప్ర‌ధాని మోడీ.. ఫ్రాన్స్ ప్ర‌ధాని మ‌ధ్య చ‌ర్చ‌కు రాలేద‌ని అప్ప‌ట్లో విదేశాంగ కార్య‌ద‌ర్శి జ‌య‌శంక‌ర్ వెల్ల‌డించ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అంతేకాదు.. ఇద్ద‌రు దేశాధినేత‌ల మ‌ధ్య అంత‌ర్జాతీయ అంశాలు మాత్ర‌మే వ‌చ్చాయి త‌ప్పించి.. ఇంకే అంశాలు రాలేద‌ని చెప్పారు.

అయితే.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇందులో ముఖ్య‌మైన‌ది.. మోడీ త‌న మంత్రుల‌తో ఎవ‌రితోనూ మాట్లాడ‌కుండానే రాఫెల్ డీల్ కు సంబంధించి త‌నంత‌ట తానే నిర్ణ‌యాలు తీసుకొని ఉంటార‌ని చెబుతున్నారు. మంత్రుల వ‌ద్ద ప్ర‌స్తావ‌న తీసుకురాకుండానే రాఫెల్ డీల్ కు సంబంధించి తెర వెనుక జ‌ర‌గాల్సిన ప‌ని మొత్తాన్ని చేసేసి.. చివ‌ర్లో చెప్పి ఉంటార‌ని చెబుతున్నారు. తాజాగా వెలుగు చూస్తున్న ప‌రిణామాలు చూస్తే.. ఈ వాద‌న‌లో నిజం ఉంద‌న్న అనుమానం క‌లుగ‌క మాన‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English