కొండా సురేఖ‌.. ఆ ద‌మ్మే వేర‌ప్పా!

కొండా సురేఖ‌.. ఆ ద‌మ్మే వేర‌ప్పా!

ఆడు మ‌గడ్రా బుజ్జి అన్న సినిమా డైలాగును చాలామంది చాలాసార్లు వాడేసి ఉంటారు. కానీ.. తాజాగా ఫైర్ బ్రాండ్ కొండ సురేఖ ప్రెస్ మీట్ చూసినోళ్లంతా ఏక‌గ్రీవంగా ఆ డైలాగ్ కు అస‌లుసిస‌లు రూపం కొండా సురేఖేన‌ని తేల్చేస్తున్నారు. మ‌హిళా నేత అయి ఉండి.. కేసీఆర్ లాంటి కొండ‌ను ఢీ కొట్ట‌టం.. అందునా కేసీఆర్ పార్టీలో ఉంటూ ఆయ‌న‌పైనా.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పైనా ఇంత తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టానికి చాలానే ద‌మ్ము కావాల‌ని.. అయితే త‌మ‌లో ఆ ద‌మ్ము ట‌న్నులు.. ట‌న్నులు ఉంద‌న్న విష‌యాన్ని కొండా సురేఖ త‌న తూటాల్లాంటి మాట‌ల‌తో స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. సురేఖ మాట‌ల్లో నిజం ఎంత‌? అబ‌ద్ధం ఎంత‌?  ఇన్ని నీతులు చెప్పిన కొండా సురేఖ చేసే రాజ‌కీయం ఏమిటి? త‌మ అడ్డాలో వారి ఆరాచ‌కాల మాటేంటి? ఇలాంటి ప్ర‌శ్న‌ల్ని కాసేపు ప‌క్క‌న పెట్టేస్తున్న ప‌లువురు.. కొండా సురేఖ ధైర్యాన్ని పెద్ద ఎత్తున పొగిడేస్తున్నారు. ఇంత తెగ‌వా? అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఇదొక్క రాజ‌కీయ రంగంలోనే కాదు.. పోలీసు ఉన్న‌తాధికారులు మొద‌లు.. తెలంగాణ రాష్ట్రంలో ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు సైతం ఆమె వ్యాఖ్య‌ల్ని ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకోవ‌టం గ‌మ‌నార్హం.
ఇంత‌కాలం కేసీఆర్‌ను.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల్ని విమ‌ర్శిస్తే.. ఏదో జ‌రుగుతుంద‌న్న జంకు ఉండేది. కానీ.. అలాంటి అనుమానాలు అక్క‌ర్లేదంటూ త‌న బ‌హిరంగ లేఖ‌తో తీవ్ర‌స్థాయిలో దునుమాడిన కొండా సురేఖ ద‌మ్మే వేర‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

ఇన్నేళ్లు రాజ‌కీయాల్లో ఉన్నా.. కేసీఆర్ పై చేసిన ఘాటు విమ‌ర్శ‌ల‌తో ఆమె గ్రాఫ్ ఎక్క‌డికో వెళ్లింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. మిగిలిన విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. కొండా సురేఖ ధైర్యం ఇప్పుడు తెలంగాణ‌లోనే కాదు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English