త‌మిళ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం..

త‌మిళ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం..

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని ఉండ‌దు. రాజ‌కీయ వైరం వ్య‌క్తిగ‌త వైరానికి మ‌ధ్య తేడా అస్స‌లు ఉండ‌దు. తాను ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి క‌రుణ‌ను రాత్రి వేళ జైల్లో వేస్తే.. త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన క‌రుణ.. జ‌య‌ల‌లిత‌ను జైలుకు పంపే వ‌ర‌కూ నిద్ర‌పోని ప‌రిస్థితి.

సినిమాల్లో మాత్ర‌మే క‌నిపించే ప‌గ‌.. ప్ర‌తీకారం.. ప్ర‌త్య‌ర్థి సంగ‌తి చూసేందుకు దేనికైనా రెఢీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ధోర‌ణి ప్ర‌జాస్వామ్య రాజ‌కీయాల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థులైన డీఎంకే.. అన్నాడీఎంకేల మ‌ధ్య ఆహ్వానాలు.. పిలుపులు అన్న‌వి ఉండ‌వు అలాంటివేళ‌.. అన్నాడీఎంకే ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మానికి డీఎంకే అధినేత‌ను పిల‌వ‌టం.. వ‌చ్చి త‌మ స‌భ‌లో మాట్లాడాల‌ని కోర‌టం అంటే న‌మ్మ‌లేన‌ట్లుగా ఉంటుంద‌ని చెప్పాలి.

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నంగా మారిన తాజా ఉదంతం ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. డీఎంకే.. అన్నాడీఎంకేల మ‌ధ్య‌నున్న రాజ‌కీయ వైరాన్ని ప‌క్క‌న పెట్టి.. అన్నాడీఎంకే  ఆధ్వ‌ర్యంలో ఈ నెల 30న జ‌ర‌ప‌నున్న పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు.. మాజీ సీఎం ఏంజీఆర్ శ‌త‌జ‌యంతి ముగింపు వేడుక‌ల ఆహ్వాన‌ప‌త్రిక‌లో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. డీఎంకే ఎంపీ క‌నిమొళి పేర్ల‌తో పాటు.. అమ్మా మ‌క్క‌ల్ మున్నేట్ర క‌ళ‌గం డిప్యూటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టీటీవీ దిన‌క‌ర‌న్ పేర్లు ఉండ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఆహ్వాన ప‌త్రిక‌లో పేర్ల‌ను ముద్రించ‌ట‌మే కాదు.. వారిని స‌భ‌లో మాట్లాడాల‌ని కోర‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దీనిపై అన్నాడీఎంకే మంత్రి మాఫాయ్ పాండియ‌రాజ‌న్ మాట్లాడుతూ.. ఎంజీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల్ని చెన్నైలో ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నామ‌ని.. అందులో భాగంగా అన్ని పార్టీల నేత‌ల్ని ప్ర‌భుత్వం ఆహ్వానిస్తోంద‌ని.. అందులో భాగంగా స్టాలిన్‌.. క‌నిమొళి.. దిన‌క‌ర‌న్ ల‌ను పిలిచిన‌ట్లుగా చెప్పారు. త‌మ వ‌ర‌కు తాము గౌర‌వంగా ఆహ్వానిస్తున్నామ‌ని.. కార్య‌క్ర‌మానికి వ‌స్తారా?  రారా?  అన్న‌ది వారిష్టంగా పేర్కొన్నారు. మ‌రి.. అన్నాడీఎంకే స‌ర్కారు తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యానికి స్టాలిన్‌.. దిన‌క‌ర‌న్ లు ఎలా రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English