కొండా సురేఖ సంచ‌ల‌నం.. కేసీఆర్ ను క‌డిగిపారేశారు!

కొండా సురేఖ సంచ‌ల‌నం.. కేసీఆర్ ను క‌డిగిపారేశారు!

అస‌లే ఫైర్ బ్రాండ్‌. ఆ పై ఆగ్ర‌హం జ‌త క‌లిస్తే?  తాజాగా హైద‌రాబాద్ లో పెట్టిన ప్రెస్ మీట్ మాదిరే ప‌రిస్థితి ఉంటుంది. తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను విమ‌ర్శించ‌టం అంటే అంత తేలికైన ముచ్చ‌ట కాదు. ఎన్నో గ‌ట్స్ ఉండాలి. విమ‌ర్శ‌ల‌ త‌ర్వాత ఎదుర‌య్యే విప‌రిణామాల‌కు ఎదురొడ్డే ధైర్యం ఉండాలి. అలాంటివి త‌న‌లో ట‌న్నులు ట‌న్నులు ఉన్నాయ‌న్న విష‌యాన్ని గ‌తంలో ప‌లుమార్లు ఫ్రూవ్ చేసుకున్న ఆమె.. టీఆర్ఎస్ లో చేరిన త‌ర్వాత కామ్ అయ్యారు.

టికెట్ల లొల్లి పుణ్య‌మా అని టీఆర్ఎస్ లోనే ఉన్న‌ ఆమె.. కేసీఆర్ ను ఉద్దేశించి నిప్పులు చెరిగారు. త‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండా రిజెక్ట్ చేసిన కేసీఆర్ పై ఆమె తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్త‌ట‌మే కాదు.. కేసీఆర్ కుటుంబ పాల‌న‌పైన ఫుల్ ఫైర్ అయ్యారు.

ఇటీవ‌ల కాలంలో కేసీఆర్ ను ఉద్దేశించి ఇంత ఘాటైన విమ‌ర్శ‌లు చేసిన నేత మ‌రొక‌రు లేర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్న ఆమె.. కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేసేందుకు వీలుగా ప్ర‌త్యేక ప్రెస్ మీట్ పెట్టారు. టీఆర్ఎస్ పార్టీలోనే ఉండి.. అధినేత‌పై ఇంత తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టిన వారు.. విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేసిన నేత కొండా సురేఖే అవుతార‌ని చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఏమ‌న్నారంటే?

కేసీఆర్ ది తుగ్ల‌క్ పాల‌న అని.. ధ‌నికుల‌కే మేలు చేసేలా ఆయ‌న అన్యాయ‌మైన పాల‌న చేస్తున్నార‌న్న ఆమె.. త‌న‌కు టికెట్ ను నిరాక‌రించి త‌మ ఆత్మాభిమానాన్ని టీఆర్ఎస్ అధినాయ‌క‌త్వం దెబ్బ తీసింద‌న్నారు. ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ఒక్క‌రోజు కూడా స‌చివాల‌యానికి వెళ్ల‌లేద‌ని మండిప‌డ్డ ఆమె.. ఓట‌మి భ‌యంతోనే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు కేసీఆర్ వెళుతున్న‌ట్లు వ్యాఖ్యానించారు.

కేసీఆర్ కుమారుడు తాజా మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ని సెటిల్ మెంట్లు చేశారో బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. త‌న కుటుంబంలో న‌లుగురికి కీల‌క ప‌ద‌వులు ఇచ్చిన కేసీఆర్.. ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌ల‌వ‌లేద‌ని మండిప‌డ్డారు. రైతుబంధు ప‌థ‌కంతో ధ‌నిక రైతుల‌కే మేలు జ‌రిగింద‌న్నారు.
 
త‌మ ప్ర‌భుత్వంలో ఒక్క మ‌హిళ‌ను కూడా మంత్రిని చేయ‌లేద‌న్న కేసీఆర్‌.. డ‌బుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తాన‌ని చెప్పి నిరుపేద‌ల‌ను మోసం చేశార‌న్నారు. అమ‌ర‌వీరుల కుటుంబాల్లో ఒక్క‌రికి టికెట్ ఇవ్వ‌లేద‌ని.. శ్రీ‌కాంతాచారి త‌ల్లికి టికెట్ ఎందుకు ఇవ్వ‌లేదు? అని ప్ర‌శ్నించారు.

మందుగోలీలు ఇచ్చే సంతోష్ ను రాజ్య‌స‌భ‌కు పంపార‌ని.. ల‌ష్క‌ర్ బోనాల‌కు బంగారు బోనం ఎత్తుకోవ‌టానికి క‌విత‌కు అర్హ‌త ఏమిటి? అంటూ ప్ర‌శ్నించిన ఆమె.. త‌న కుమారుడికి ప‌ట్టం క‌ట్టేందుకే కేసీఆర్ ఆరాట‌ప‌డుతున్నార‌న్నారు. కేసీఆర్ పాల‌న మొత్తం అవినీతిమ‌యంగా మారింద‌ని.. ప్ర‌తి ప‌నికి కాంట్రాక్ట‌ర్ల నుంచి క‌మీష‌న్లు దండుకుంటున్న‌ట్లు చెప్పారు.

రాష్ట్రంలో విచ్చ‌ల‌విడిగా బార్ల‌కు అనుమ‌తులు ఇచ్చార‌ని.. ఉద్యోగుల డిమాండ్లు ప‌రిష్క‌రించ‌లేద‌న్నారు. ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేద‌ని.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న గ‌ట్ట‌య్య ఆత్మ శాంతించాలంటేటీఆర్ఎస్ ను ఓడించాల‌న్నారు. ఉద్య‌మంలో కోదండరాంను పొగిడిన వాళ్లు ఇప్పుడు తిడుతున్నార‌న్నారు. ఉద్య‌మ‌కారుల‌కు నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వ‌కుండా మోసం చేశార‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English