‘ఆయుష్మాన్‌ భారత్‌’.. మాకొద్దు

‘ఆయుష్మాన్‌ భారత్‌’.. మాకొద్దు

‘ఆయుష్మాన్‌ భారత్‌’.. పేద ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య బీమా క‌ల్పించేందుకుగాను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంబించిన ప‌థ‌కం. దేశ‌వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల కుటుంబాలు.. అంటే సుమారు 50 కోట్ల మంది ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొందే అవ‌కాశ‌ముంద‌ని కేంద్రం చెబుతోంది.

ఒక్కో కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆరోగ్య బీమా క‌ల్పిస్తామ‌ని వివ‌రిస్తోంది. అయితే, బీజేపీయేత‌ర పార్టీల పాల‌న‌లో ఉన్న 5 రాష్ట్రాల్లో మాత్రం ఈ ప‌థ‌కం అమ‌లు కావ‌డం లేదు. తెలంగాణ కూడా ఇందులో ఒక‌టి. మిగిలిన నాలుగు రాష్ట్రాలు.. డిల్లీ, ఒడిశా, కేర‌ళ‌, పంజాబ్‌.

ఆయుష్మాన్ భార‌త్ మంచి ప‌థ‌క‌మే. అయితే, ఈ ప‌థ‌కంతో పోలిస్తే తాము సొంతంగా అమ‌లు చేస్తున్న హెల్త్ స్కీమ్‌లు మ‌రింత మెరుగైన‌వ‌ని తెలంగాణతోపాటు మిగిలిన 4 రాష్ట్రాలు చెబుతున్నాయి. ఆయుష్మాన్ భార‌త్ పూర్తిగా కేంద్ర‌ప్ర‌భుత్వ ప‌థ‌క‌మేమీ కాదు. దానిక‌య్యే ఖ‌ర్చులో రాష్ట్రాలూ కొంత మొత్తం భ‌రించాల్సి ఉంటుంది. ఈ వాటా రాష్ట్రాల‌ను బ‌ట్టి మారుతుంటుంది. మొత్తంగా కేంద్ర-రాష్ట్రాల వాటా ఈ ప‌థ‌కంలో 60-40 శాతం నుంచి 90-10 శాతం వ‌ర‌కు వేర్వేరుగా ఉంది. దీంతో తాము డ‌బ్బు చెల్లించి.. పేరు మాత్రం కేంద్రానికి ఎందుకు క‌ట్ట‌బెట్టాల‌నే యోచ‌న‌లో కూడా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అందుకే ప‌థ‌కం అమ‌లుకు స‌సేమిరా అంటున్నాయి.

తెలంగాణ విష‌యానికే వ‌స్తే.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ ప‌థ‌కం అమ‌ల్లో ఉంది. పేద ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య శ్రీ ప‌థ‌కం ఓ వ‌ర‌మ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతోంది. ఆ ప‌థ‌కం స‌క్ర‌మంగా అమ‌ల‌వుతుండ‌గా వేరే ప‌థ‌కాల గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఏంట‌ని ప్ర‌శ్నిస్తోంది. అందుకే తాము ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కంలో చేర‌బోమ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఒక‌వేళ రాష్ట్రానికి మ‌రింత ప్ర‌యోజ‌నం చేకూరేలా నిబంధ‌న‌ల్లో కేంద్రం మార్పులు చేస్తే అప్పుడు ఆలోచిస్తామ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English