జ‌గ‌న్ చెప్పినోళ్లకే కాంట్రాక్టులిస్తున్న కేసీఆర్‌

జ‌గ‌న్ చెప్పినోళ్లకే కాంట్రాక్టులిస్తున్న కేసీఆర్‌

మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్‌ సీనియ‌ర్ నేత‌, మంత్రి హ‌రీశ్‌రావు ఎపిసోడ్‌పై ఆయ‌న స్పందిస్తూ విరుచుకుప‌డ్డారు. హరీష్ ఆవేదన అంతా ఒట్టి డ్రామా అని యాష్కీ ఆరోపించారు. టీఆర్ఎస్‌లో కేసీఆర్‌పై అసంతృప్తి వాదులను హరీష్‌కు దగ్గర చేసేందుకే ఈ డ్రామా సాగుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేన‌ని వెల్ల‌డించిన యాష్కీ ఈ విష‌యంలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ సవాల్ విసిరారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మధుయాష్కీ చాలెంజ్ చేశారు. ``టైమ్, ప్లేస్ నువ్వే చెప్పు ..వచ్చేందుకు నేను రెడీ. నువ్వు రెడీయా?``  అంటూ యాష్కీ బ‌హిరంగ ప్ర‌తిపాద‌న పెట్టారు.

ఆజాద్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్‌ ఎంపీ వినోద్ సోయిలేకుండా మాట్లాడారని మ‌ధుయాష్కీ మండిప‌డ్డారు. ``పదవులొద్దు అన్న కేసీఆర్ సీఎం ఎందుకు తీసుకున్నారో వినోద్ చెప్పాలి. రాష్ట్రాల ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్ కు ఉంటుందన్న సోయి లేదా? ప్రజల త్యాగాలను గుర్తించే సోనియా తెలంగాణ ఇచ్చింది తెలియదా?

రెండు ఎంపీ స్థానాలతో తెలంగాణ తెచ్చామంటే ..ఇప్పుడు ఇంత మంది ఎంపీలుండి ఎందుకు మైనార్టీ రిజర్వేషన్ లు సాధించలేదు?`` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఎంపీ వినోద్‌పై ఈ సంద‌ర్భంగా వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేశారు. ``వినోద్‌కుమార్  నీ తమ్ముడి మెడికల్ కాలేజీల కోసం నన్ను ఎన్నిసార్లు బతిమాలావో మరిచిపోయావా? మధుయాష్కీ, ఆజాద్, జైరాం రమేష్ ల ఇంటి చుట్టూ ఎన్నిసార్లు చక్కర్లు కొట్టినావో మారిపోయావా?   కేసీఆర్ నిమ్స్ లో ఉన్నప్పుడు కేటీఆర్ , కవిత లు నన్ను కలిసి బతిమిలాడింది మర్చిపోయారా.?`` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదంటే టీఆరెస్ నేతలు పురుగులు పడి చస్తారని యాష్కీ శ‌పించారు!.  `కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకుంటే నాడు తెలంగాణా కోసం పనిచేసింది కాంగ్రెస్ ఎంపీల‌ని ఆయ‌న పేర్కొన్నారు. ``కౌలు రైతు వెంకటేష్ ఆత్మహత్య కాదు కేసీఆర్ చేసిన హత్య. రైతులారా ఆధైర్యపడకండి ..వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాళేశ్వరం రీడిజైన్లతో కల్వకుంట్ల కంపుగా మారింది.

కేసీఆర్ చెప్పిన అబద్దాలతో మోసపోయే 2014లో అధికారంలోకి వచ్చారు. కానీ మ‌ళ్లీ ఆ అవకాశం లేదు. 2019లో సైలెంట్ విప్లవం రాబోతుంది..టీఆరెస్ ను బొందపెట్టడం ఖాయం` అని వ్యాఖ్యానించారు.   పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ నిర్మాణం కావు కానీ కవితకు కోట్ల విలువ చేసే విల్లాలు ఎలావచ్చాయని యాష్కీ ప్ర‌శ్నించారు.

``వైఎస్ జగన్ ఫోన్ చేస్తే రాయలసీమ కాంట్రాక్టర్ల‌కు పనులు ఇచ్చింది నిజం కాదా? పద్మాలయ కేసును ఎందుకు ఉపసంహరించుకున్నారో హరీష్ రావు ఎందుకు ప్ర‌క‌టించ‌రు? ఎంపీ వినోద్‌, ఆయ‌న తమ్ముడు, కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంతో ఎందుకు ప్ర‌క‌టించ‌రు?`` అంటూ యాష్కీ విరుచుకుప‌డ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English