చింత చచ్చినా పులుపు చావలేదు

చింత చచ్చినా పులుపు చావలేదు

స్పాట్‌ ఫిక్సింగ్‌లో బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌పైన ఆరోపణలు రాగా ఎట్టకేలకు ఆయన స్పందించక తప్పలేదు. తన అధ్యక్ష పదవి రాజీనామాపై వస్తున్న డిమాండ్లను ఆయన తప్పుపట్టారు. తాను రాజీనామా చేయవలసిన అవసరం లేదని, తాను రాజీనామా చేయనని చెప్పారు శ్రీనివాసన్‌.

ఐపిఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ కేసులో శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మయ్యప్పన్‌ అరెస్టవడంతో శ్రీనివాసన్‌ బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. దాంతో స్పందించాల్సి వచ్చింది శ్రీనివాసన్‌కి. తానేతప్పూ చేయలేదని, బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేశారు.

కొంతమంది తనపై కుట్రపూరితంగా ఒత్తిడిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన చెందారు శ్రీనివాసన్‌. బీసీసీఐ కఠిన నిబంధనలను అనుసరిస్తుందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాజకీయ నాయకుడిలా మాట్లాడారాయన. ఐపిఎల్‌ వల్లన దేశంలో క్రికెట్‌ భ్రష్టుపట్టిపోతున్నదని విమర్శలు వస్తుండగా, దానిపై బిసిసిఐ వివరణ ఇవ్వడానికే ఆసక్తి చూపడంలేదు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు