ఆ హ‌త్యపై ట్వీట్ ద్వారా కాదు...నేరుగా స్పందించు కేటీఆర్‌

ఆ హ‌త్యపై ట్వీట్ ద్వారా కాదు...నేరుగా స్పందించు కేటీఆర్‌

మిర్యాలగూడలో ప‌రువు హ‌త్య‌కు గురైన‌ ప్రణయ్ ఉదంతంపై హత్యపై మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి నాయ‌కుడు మంద కృష్ణ మాదిగ స్పందించారు. వరంగల్ అర్బన్‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌ణ‌య్ హ‌త్య‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ హ‌త్య‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించ‌డం కంటే నేరుగా కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. దోషుల‌కు నిజంగా శిక్ష పడాలని కోరుకుంటే, టీఆరెస్ పార్టీ నుంచి ముందు సస్పెండ్ ఎందుకు చేయలేదని ప్ర‌శ్నించారు. అధికార పార్టీ అండదండలు చూసుకునే ఇంత దారుణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో వారికి ఉన్న రాజకీయ ఆర్ధిక అండదండలతో శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితి ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాలకుల అండదండలు చూసుకునే హత్యకు పాల్పడ్డారని, హత్యకు సంబంధించి అందరూ బయటపడాలి, వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేటీఆర్ స్పష్టమైన వైఖరి తెలపాలని చట్టాన్ని మరింత పటిష్టం చేసి శిక్ష పడేలా చేయాలని కోరారు.

మిర్యాలగూడలోని అన్ని పార్టీలను మారుతి రావు గుప్పిట్లో పెట్టుకున్నాడని మంద‌కృష్ణ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు కరీం సూత్రధారి అని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌ణ‌య్‌, అమృత‌కు ప్రమాదం ఉందని తెలిసి కూడా కాపాడే ప్రయత్నం పోలీసులు ఎందుకు చేయలేదని ప్ర‌శ్నించారు. మారుతిరావుపై నిఘా పెడితే పోలీసు అధికారులను అదుపులో పెట్టుకునేవాడన్నారు. హత్యకు గంట ముందు వేములపల్లి కట్ట మీద డీఎస్‌పీతో 15నిమిషాలు మాట్లాడుకున్నారని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సెటిల్‌మెంట్‌లతో అక్రమాస్తులు కూడగట్టుకున్నడని అందరికి తెలుసని అన్నారు. ప్రేమించడం లేదని కొంత మంది దళితులపై దాడులు చేస్తున్నారని మందకృష్ణ వ్యాఖ్యానించారు.మిర్యాలగూడ సెంటర్ లో ప్రణయ్ విగ్రహం నెలకొల్పేందుకు కేటీఆర్ అనుమతి ఇవ్వాలన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English