మారుతిరావుకు ఏ శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది?

మారుతిరావుకు ఏ శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది?

అల్లారు ముద్దుగా పెంచుకున్న క‌న్న‌కూతురు న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌టాన్ని భ‌రించ‌లేని మిర్యాల‌గూడ వ్యాపారి మారుతిరావు కిరాయి మూక‌తో త‌న కుమార్తె భ‌ర్త‌ను పాశ‌వికంగా హ‌త్య చేయించిన ఆరోప‌ణ‌ను ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ప‌ట్ట‌లేని కోపంతోనే త‌న కుమార్తె భ‌ర్త‌ను హ‌త్య చేయాల‌ని సుపారీ ఇచ్చి మ‌రీ హ‌త్య చేయించిన‌ట్లుగా మారుతిరావు పోలీసుల‌కు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్ల‌డించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

త‌మ కంటే త‌క్కువ కులం వ్య‌క్తిని ప్రేమించి పెళ్లాడిన కుమార్తె నిర్ణ‌యంపై తీవ్ర ఆగ్ర‌హానికి గురైన మారుతిరావు.. క‌క్ష క‌ట్టి చంపేయించిన తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది.
ఇదిలా ఉంటే.. కిరాయి హంత‌కుల‌తో త‌న కుమార్తె భ‌ర్త‌ను కిరాత‌కంగా చంపించిన మారుతి రావుకు ఎలాంటి శిక్ష ప‌డుతుంది?  గ‌తంలో ఇదే త‌ర‌హా కేసుల విష‌యంలో అత్యున్న‌త న్యాయ‌స్థానాల నిర్ణ‌యాలు ఎలా ఉన్నాయి? అన్న ప్ర‌శ్న‌లు వేసుకుంటే.. ఆస‌క్తిక‌ర స‌మాధానాలు వ‌స్తాయి.

ప‌రువు హ‌త్య‌ల్ని అత్యంత అరుదైన కేసులుగా ప‌రిగ‌ణించాలంటూ దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు గ‌తంలో స్ప‌ష్టం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. అత్యంత హేయ‌మైన‌.. అనాగ‌రిక‌మైన ఈ చ‌ర్య‌ల్ని స‌మూలంగా నిర్మూలించాల‌ని కోర్టు పేర్కొన్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

త‌మ అభిప్రాయం ఏదైనా.. ప‌రువు హ‌త్య‌ల్ని అత్యంత అరుదైన కేసులుగా ప‌రిగ‌ణించాల‌ని.. ఇలాంటి కేసుల్లో దోషుల‌కు ఉరిశిక్ష వేయాల్సిందేన‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇందుకు ఒక కేసును ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొంటున్నారు. ఢిల్లీకి చెందిన భ‌గ‌వాన్ దాస్ కుమార్తె ఆయ‌న ఇష్టానికి వ్య‌తిరేకంగా మేన‌మామ కొడుకును పెళ్లి చేసుకొని ప‌రువు తీసింద‌న్న కోపంతో ఆమెను హ‌త‌మార్చారు. ఈ కేసును విచారించిన కోర్టు ప‌రువుహ‌త్య‌పై కీల‌క‌ వ్యాఖ్య‌లు చేయ‌టంతో పాటు.. ఇలా చేయ‌టాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది.

చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి తీసుకొని హింసాత్మ‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కూడ‌ద‌ని చెప్పిన సుప్రీం.. ప‌రువు హ‌త్య‌ల్ని అత్యంత అరుదైన కేసులుగా ప‌రిగ‌ణించాల‌ని చెప్ప‌టంతో పాటు దోషుల‌కు ఉరి విధించాల‌ని తేల్చింది.

ఈ తీర్పునుదేశంలోని అన్ని కోర్టుల‌కు ఉత్త‌ర్వులిచ్చింది. మ‌రో కేసులోనూ ఇలాంటి తీర్పునే ఇచ్చింది. ఢిల్లీలోని షియా వ‌ర్గానికి చెందిన యువ‌తి సున్నీ వ‌ర్గానికి చెందిన యువ‌కుడ్ని పెళ్లాడింది. దీంతో.. ఆ యువ‌తి సోద‌రులు పెళ్లాడిన యువ‌కుడి త‌మ్ముడ్ని హ‌త్య చేశారు.

ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా అభివ‌ర్ణించిన ఢిల్లీ కోర్టు నిందితుల్లో ఐదుగురిని దోషులుగా తేలుస్తూ వారికి య‌వ‌జ్జీవ కారాగార‌శిక్ష‌ను విధించారు. ఈ కేసుల ఆధారంగా చూస్తే.. మారుతి రావు వ్య‌వ‌హారం కూడా అత్యంత అరుదుగా కోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే వీలుంద‌న్న మాట వినిపిస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English