ఓవైసీ స‌త్తా ఏంటో తేల్చేస‌వాల్ విసిరిన బీజేపీ

ఓవైసీ స‌త్తా ఏంటో తేల్చేస‌వాల్ విసిరిన బీజేపీ

తెలుగు రాష్ర్టాల్లో ముంద‌స్తు ఎన్నిక‌ల వేడి తారాస్థాయికి చేరుతోంది. ప్ర‌ధాన పార్టీల‌న్నీ త‌మ వ్యూహాల‌కు ప‌దునుపెడుతూ క‌ద‌న‌రంగంలోకి దూకుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శ‌నివారం తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌మ పార్టీని బ‌లోపేతం చేసేందుకు హైద‌రాబాద్‌లో షా ప‌ర్య‌టించారు. అయితే, అమిత్ షా ప‌ర్య‌ట‌న‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస‌క్తిక‌ర  ట్వీట్ చేశారు.  హైదరాబాద్‌లో పోటీ చేయాలని కోరుతున్నామని ఆయ‌న పేర్కొన్నారు. అమిత్ షా హైదరాబాద్‌లో పోటీ చేసినా ఎంఐఎందే విజయమని ఓవైసీ స్పష్టం చేశారు. ఇప్పుడున్న 5 స్థానాలను కూడా బీజేపీ మళ్లీ దక్కించుకోలేదని పేర్కొన్నారు. పెట్రోల్ ధరలు, ఉద్యోగ కల్పనపై ప్రజలకు బీజేపీ ఏం చెబుతుందని ఓవైసీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

కాగా, దీనిపై బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాద్‌లో పోటీ చేస్తే చిత్తుగా ఓడిస్తామన్న మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ త‌న స‌త్తా ఏంటో తెలుసుకోవాల‌న్నారు. అమిత్‌ షా వరకు ఎందుకుగానీ.. ఒవైసీకి దమ్ము, ధైర్యం ఉంటే అంబర్‌పేటలో తనపై పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్‌ విసిరారు. ఇవాళ ఉదయం ఓ సభలో పాల్గొన్న షా.. ఒవైసీని అభినవ రజాకార్‌ అని విమర్శించడంతో  ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

మ‌రోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ సైతం మ‌జ్లిస్‌పై మండిప‌డ్డారు. హైదరాబాద్‌తో అమిత్‌ షా పోటీ చేస్తే ఓడిస్తామన్న ఓవైసీ సవాల్‌కు స్పందిస్తూ.. మజ్లిస్‌పై సామాన్య కార్యకర్తను బరిలో నిలిపి హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు. మజ్లిస్‌ను కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, టీడీపీలు పాముకు పాలు పోసి పెంచినట్టు పెంచాయని విమర్శించారు. బీజేపీకి అధికారం ఇచ్చి.. టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలని లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. బీజేపీని నేరుగా ఎదుర్కోలేకే ప్రతిపక్షాలు అనైతిక పొత్తులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్‌ను బీజేపీ సింగిల్‌గా.. సింహంలా ఎదుర్కొంటుంద‌ని ల‌క్ష్మ‌ణ్ ప్ర‌క‌టించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English