అమరవీరుల ఊసెత్తరు

అమరవీరుల ఊసెత్తరు

తెలంగాణ ఉద్యమం ఉధృతమవ్వాలంటే అమాయకులు బలైపోవాలి. అలా అమాయకులు బలైపోవడానికి ఉద్యమం ముసుగులో రాజకీయ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తారు. కాని అమాయకులు బలవన్మరణాలకు పాల్పడితే, వారిపై అమరవీరులన్న ముద్ర వేయడం తప్ప, వారి మరణం కారణంగా రోడ్డునపడ్డ వారి కుటుంబాలను ఆదుకోవడానికి రాజకీయ పార్టీలకు తీరిక ఉండదు.

ఉప ఎన్నికలు వచ్చినప్పుడే అమరవీరుల కుటుంబాల్లోనివారికి టిక్కెట్లు ఇవ్వాలనే డిమాండ్లు వచ్చాయి. వాటిని ఉద్యమ పార్టీ కూడా లెక్కచేయలేదు. సాధారణ ఎన్నికలలో అయినా అమరవీరుల కుటుంబాలకు పదో వంతు టిక్కెట్లు ఇచ్చినా అది వారిని గౌరవించినట్లవుతుంది. తెలంగాణ జెఎసి జెండా మీదన అమరవీరులకు టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్లు బాగా వినవస్తున్నవి. వీటిపై ఏ రాజకీయ పార్టీ ఎలా స్పందించనున్నదో చూడాలిక.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు