జగన్ పయనం కారుతోనే...

జగన్ పయనం కారుతోనే...

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అన్ని సిద్ధమవుతున్నాయి. ఇక షెడ్యూల్ ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతోనూ ఇతర పార్టీలతోనూ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక అధికార తెలంగాణ రాష్ట్ర సమితి లోపాయికారిగా భారతీయ జనతా పార్టీతోనూ అధికారికంగా మజ్లీస్ పార్టీతోనూ కలిసి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎవరితో పయనిస్తుంది.... ఒంటరిగానే పోటీ చేస్తుందా అన్నది సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఖమ్మంతో పాటు వరంగల్, నల్లగొండ, జంటనగరాలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. దీంతో ఫ్యాన్ పార్టీ కారు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి ఇంతకు ముందు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన పొంగులేని శ్రీనివాస రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని చెబుతున్నారు. ఈ పొత్తుపై భారతీయ జనతా పార్టీ నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్లు చెబుతున్నారు.

ఇంతకు ముందు చాలా సార్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన ప్రసంగాల్లో చంద్రబాబు నాయుడిపైనా.... కాంగ్రెప్ పార్టీపైనా నిప్పులు చెరిగారు.అయితే ఏ ఒక్కసారి కూడా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్దిని పల్లెత్తు మాట అనలేదు. పైగా వీరిద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణమే ఉందని అంటున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల సానుకూలత వ్యక్తం అవుతోందని, ఇది జగన్‌కు ఉపకరిస్తుందని ఆ పార్టీ నాయకులు చెబతున్నారు. ఇవన్నీ ద్రష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర సమితి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలు అధికారికంగా కాకపోయినా లోపాయికారిగా కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, జగన్ వైపు నుంచి మాత్రం లోపాయికారి పొత్తు కంటే అధికారికంగానే కలిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా వచ్చినట్లు చెబుతున్నారు.

శత్రుత్వం చిరకాలం ఉండదని, తెలంగాణ రాష్ట్ర సమితి పాలన పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి అభిప్రాయం ఉండడంతో తెలంగాణలో కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదని జగన్ తమ నాయకులతో అన్నట్లు చెబుతున్నారు.మొత్తానికి రెండు, మూడు రోజుల్లో ఈ రెతండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని రెండు పార్టీలకు చెందిన వారు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు