బాబు ఇష్యూలో శివాజీ చెప్పిందే నిజ‌మైందిగా?

బాబు ఇష్యూలో శివాజీ చెప్పిందే నిజ‌మైందిగా?

నాలుగైదు రోజుల క్రితం సినీ న‌టుడు క‌మ్ ఏపీ ప్ర‌త్యేక హోదా మీద త‌ర‌చూ గ‌ళం విప్పే శివాజీ చెప్పిన మాట‌లే నిజం కావ‌టం సంచ‌ల‌నంగా మారింది. గ‌త వారంలో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన శివాజీ త్వ‌ర‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఓ రాజ్యాంగ‌బ‌ద్ధ సంస్థ నుంచి నోటీసులు అంద‌నున్న‌ట్లు చెప్పారు. తానీ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిన నేప‌థ్యంలో నాలుగైదురోజులు ఆల‌స్య‌మ‌వుతుందే కానీ.. నోటీసులు రావ‌టం మాత్రం ఖాయ‌మ‌న్న విష‌యాన్ని చెప్పి అంద‌రికి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

బాబుకు నోటీసులు అన్నంత‌నే ఈడీ రంగంలోకి దిగుతుందా? ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో ఆయ‌న‌కు నోటీసులు ఇస్తారా? అన్న చ‌ర్చ జ‌రుగుతున్న వేళ‌.. ఇందుకు భిన్నంగా అప్పుడెప్పుడో ముగిసింద‌ని అనుకుంటున్న బాబ్లీ కేసు తెర మీద‌కు రావ‌ట‌మే కాదు.. ఆ కేసుకు సంబంధించి నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇష్యూ కావ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ చంద్ర‌బాబుకు బాబ్లీ కేసులో నోటీసులు ఇవ్వ‌టం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.  విప‌క్ష నేత‌గా ఉన్న వేళ‌.. బాబ్లీ ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన చంద్ర‌బాబు.. మ‌హారాష్ట్ర పోలీసుల విన‌తిని ప‌ట్టించుకోకుండా నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించ‌టం.. ఆ సంద‌ర్భంగా జ‌రిగిన లాఠీ ఛార్జ్ లో టీడీపీ ఎమ్మెల్యేలు గాయాల‌పాల‌య్యారు. ఈ సంద‌ర్భంగా బాబుతో స‌హా ఆయ‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను మ‌హారాష్ట్రలోని ఒక ఐటీఐ కాలేజీలో నిర్బంధంలో ఉంచారు.  అనంత‌రం వారిని బ‌ల‌వంతంగా విమానం ఎక్కించి హైద‌రాబాద్‌కు పంపేశారు.

ఈ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో సంచ‌ల‌నమైంది. ఆ సంద‌ర్భంలో పెట్టిన కేసుల‌ను త‌ర్వాతి కాలంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అందుకు భిన్నంగా తాజాగా బాబుకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇష్యూ కావ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌.. ఈ కేసును ఏదైనా సంస్థ‌కు అప్ప‌గించ‌నున్నారా? అన్న ది ప్ర‌శ్న‌గా మారింది. ఈ అంశంపై న్యాయ‌నిపుణుల స‌ల‌హాల్ని ఏపీ స‌ర్కారు తీసుకుంటుంద‌ని చెబుతున్నారు.

తెలంగాణ ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌.. తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసం పోరాడిన వ్య‌క్తిగా ఇమేజ్ సొంతం చేసుకోవ‌టానికి వీలుగా ఈ నోటీసులు అందుకొని.. కోర్టుకు హాజ‌రైతే మైలేజీ భారీగా వ‌స్తుంద‌న్న ఆలోచ‌న‌లో టీడీపీ వ‌ర్గాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. గ‌తంలో శివాజీ ఆప‌రేష‌న్ గ‌రుడ అంటూ భారీ ప్రెస్ మీట్ పెట్ట‌టం.. ఆ సంద‌ర్భంగా ప‌లు సంచ‌న‌ల అంశాల్ని తెర మీద‌కు తీసుకొచ్చారు.

తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఆప‌రేష‌న్ గ‌రుడ‌ను కాస్త మార్పులు చేర్పులు చేసి.. తాజాగా ప్ర‌యోగిస్తున్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. రాజ్యాంగ సంస్థ ద్వారా బాబుకు నోటీసులు అంద‌టం ఖాయ‌మ‌న్న శివాజీ మాట‌కు త‌గ్గ‌ట్లే తాజాగా నోటీసు/ ఇష్యూ కావ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఇదిలా ఉండ‌గా... తెలంగాణ కోసం పోరాడినందుకు బాబుకు అరెస్టు వారెంట్  రావ‌డం తెలంగాణ ఎన్నిక‌ల్లో బాబుకు మైలేజీ తెస్తుందే గాని న‌ష్టం చేయ‌దు అని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు