కారుకు పంచర్ తప్పదు

కారుకు పంచర్ తప్పదు

తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకి మండిపోతున్నాయి. ముఖ్యంగా ముందస్తు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఎక్కువగా తగులుతోంది. తొలి అభ్యర్దుల జాబిత 105 మందితో ప్రకటించిన తర్వాత ఈ వేడి మరింతా రాజుకుంటోంది. రోజురోజుకు అసంత్రుప్తులు, వ్యతిరేకుల జాబిత పెరిగిపోతోంది. ఇది తెలంగాణ రాష్ట్ర సమితికి తలనొప్పిగా మారింది. తెలంగాణలోని దాదాపు అన్నీ జిల్లాలోను తెలంగాణ రాష్ట్ర సమితికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ, నిజామబాద్ రెడ్డి నాయకుడు భూపతి అధిష్టానంపై భగ్గుమంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పతనం నిజామబాద్ జిల్లానుంచే ప్రారంభమవుతుందని ఆయన ప్రతీన పూనారు.

ఈ విషయాన్ని తన సహచరుల వద్ద చెప్పడం కాదు, ఏకంగా విలేఖరుల సమావేశంలోనే ప్రకటించారు. ఇదీ తెలంగాణ రాష్ట్ర సమితిని కకావికలం చేసే పరిణామం. ఎమ్మెల్సీ భూపతి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావునే టార్గెట్ చేయాడం మరో విశేషం. వచ్చే ఎన్నికలలో తాను పోటి చేస్తానని, అయితే స్వతంత్ర అభ్యర్దిగానా లేక ఏ పార్టీ నుంచైన చేస్తాన అన్నది త్వరలో ప్రకటిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని, భూపతి ఆరోపించారు. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన వారికి పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర విమర్శలు చేసారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితికి ఓ ఝలక్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మెల్సీ పదవిలో ఉన్న నాయకుడే ఇలా నేరుగా పార్టీ అధ్యక్షుడిపై విమర్శలు చేయడం ప్రాధన్యం సంతరించుకుందని విశ్లేషకుల అభిప్రాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు