కమలానికి అభ్యర్దులు కావలెను...

కమలానికి అభ్యర్దులు కావలెను...

భారతీయ జనతా పార్టీ కేంద్రంలోను, పలు రాష్ట్రలలోను అధికారంలో ఉన్న పార్టీ.  గత ఎన్నికలలో అత్యధిక మెజారిటీ స్థానాలు గెలుచుకుని ప్రతిపక్షాలకు చుక్కలు చూపెట్టిన పార్టీ. గడచిన నాలుగు సంవత్సరాలుగా దేశంలో వివిధ రాష్ట్రలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల ఆనాటి శోభ తగ్గుతోంది.

దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలు జరగనున్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటి చేసేందుకు అభ్యర్దులే కరవయ్యారు.

తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ విశ్వసించే పరిస్థితి లేదు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే కేసీఆర్ తాము రాష్ట్రంలో వంటరిగానే పోటి చేస్తామని ప్రకటించడంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్దుల వెతుకులాట ప్రారంభించింది.

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నాయకులపై కమలం కన్నేసింది. తమ నియోజకవర్గాలలో బలం ఉన్న నాయకులకు తమ పార్టీలో టిక్కెట్టు ఇస్తే తమకు రాష్ట్రంలో బలం పుంజుకుంటుందని భారతీయ జనతా పార్టీ వ్యూహం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి 105 స్థానాలలో తన అభ్యర్దులను ప్రకటించింది. దీంతో తమ నియోజకవర్గాలలో తమకు టిక్కెట్లు ఖాయమని భావించిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు భంగపడ్డారు.

వారిలో కొందరు కాంగ్రెస్  వైపు చూస్తుండగా, మరికొందరు భవిష్యత్తుపై సమాలోచనలు చేస్తున్నారు. అలాంటి వారిని ఆకర్షించి వారి చేత పోటి చేయించాలని కమలనాథుల ఎత్తుగడ. కారలో అంసంత్రుప్త నేతలను ముందు గుర్తించాలని వారికి రాజకీయ భవిష్యత్తు కల్పిస్తామని భరోసా ఇవ్వాలని కమలనాథులు భావిస్తున్నారు.దీనిపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేసిందని సమాచారం.

2019 లో జరిగే లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం తథ్యమని ఇప్పుడు పార్టీలో చేరిన వారికి పలు కార్పోరేషన్ పదవులు ఇతర పదవులు కట్టబెడతామని హామి ఇచ్చి పార్టీలోకి తీసుకు రావాలని భావిస్తున్నారు. ఈ వ్యూహన్ని అమలు చేస్తే పార్టీలో  వలసలు ఎక్కువ అవుతాయని నమ్ముతున్నారు.    

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు