సావిత్రి పాత్ర‌కు చెప్పి నో చెప్పింది అందుకేన‌ట‌!

సావిత్రి పాత్ర‌కు చెప్పి నో చెప్పింది అందుకేన‌ట‌!

మిగిలిన హీరోయిన్ల‌కు కాస్త భిన్నంగా ఉంటుంది నిత్యా మీన‌న్ వ్య‌వ‌హారం. ఆమెతో మాట్లాడ‌టం మొద‌లు పెడితే.. ఆమె గ్లామ‌ర్ కంటే గ్రామ‌ర్ దృష్టిని ఆక‌ర్షిస్తుంది. మిగిలిన గ్లామ‌ర్ భామ‌ల‌కు ఒకింత భిన్న‌మైన తీరు నిత్య‌లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌శ్న ఏద‌డిగినా.. కాపీ.. క‌ట్‌.. పేస్ట్ లాంటి స‌మాధానం చెప్ప‌కుండా.. తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా చెప్పేయ‌టానికి అస్స‌లు సందేహించ‌దు.


త‌న‌ను వేలెత్తి చూపించే అంశాల మీదా.. త‌న ఇమేజ్ ను కాసింత డ్యామేజ్ చేసే అంశాల  మీదా రియాక్ట్ కావ‌టం ఆమెలో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంది. భారీ ప్రేక్ష‌క ఆద‌ర‌ణ పొందిన మ‌హాన‌టిలో సావిత్రి పాత్ర‌ను మొద‌ట వ‌రించింది నిత్య‌నే. కానీ.. ఆమె ఆ సినిమాను మిస్ అయ్యింది.

దానికి కార‌ణం ఏమిట‌న్న విష‌యం తాజాగా ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. తాను చేసిన అలా మొద‌లైంది మూవీని చూసిన చాలామంది సావిత్రిలా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చార‌న్నారు. ఆ త‌ర్వాత మ‌హాన‌టిలో సావిత్రి పాత్ర‌ను పోషించాల‌న్న ఆఫ‌ర్ త‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా చెప్పింది.

సావిత్రి పాత్ర‌కు అడుగుతున్నారన్న మాట త‌న‌కు చాలా సంతోషం వేసింద‌ని.. సావిత్రి పాత్ర కోసం ముందు త‌న వ‌ద్ద‌కే వ‌చ్చార‌ని.. అందుకు తాను ఓకే చెప్పాన‌ని చెప్పారు. సావిత్రి పాత్ర‌ను పోషించ‌టం అంటే మాట‌లా?  అందుకే వెంట‌నే ఓకే చెప్పాన‌ని.. కానీ ఆ త‌ర్వాత మాత్రం సినిమాను వ‌దులుకున్న‌ట్లు చెప్పిన నిత్య‌.. అందుకు కార‌ణం అడిగితే చెప్ప‌లేన‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఏ ప్ర‌శ్న‌కు అయినా ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్పే నిత్య‌...సావిత్రి పాత్ర‌కు నో చెప్ప‌టానికి మాత్రం.. చెప్ప‌లేన‌ని చెప్ప‌టం ఏమిటో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు