బీసీల చెవిలో "కమలం"

బీసీల చెవిలో

ఎన్నికల వేళ అందరికి అన్ని కులాలు గుర్తుకొస్తాయి. అంతే కాదు... కులాలకు కూడా పార్టీల కాలర్ పట్టుకుందుకు ఎన్నికల వేళేఅసలైన సమయం. ఈ సమయం... సందర్భం తెలంగాణలో రానే వచ్చింది. ఇన్నాళ్లూ భారతీయ జనతా పార్టీలో మిన్నకున్న బీసీ కులాల నాయకులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో పెరిగిపోతున్నఅగ్ర కుల ఆదిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు.

పార్టీలో కిషన్ రెడ్డి,రామచంద్రారెడ్డి.. ఇలా రెడ్ల ప్రాభల్యం పెరిగిపోయిందని బీసీ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పార్టీకి తీరని చేటు చేస్తుందని వారంటున్నారు. శుక్రవారం నాడు జరిగిన పార్టీ సమావేశంలో బీసీ నాయకులు భారతీయ జనతా పార్టీలో నానాటికీ పెరుగుతున్న అగ్ర కుల ఆథిపత్యంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన 105 స్థానాలలో ఉప్పల్ మినహ అన్నీ బిజేపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాలలోఅభ్యర్దులను ప్రకటించడం భారతీయ జనతా పార్టీ బిసీ నాయకులలో అనుమానాలు రేకేత్తిస్తోంది. ఇదే విషయాలన్ని భారతీయ జనతా పార్టీ బిసీ నాయకుడు ఒకరు తప్పు పట్టారు. బిజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఇటీవల కేసీఆర్ ను కలవడం కూడా వారు తప్పుపడుతున్నారు.

బిజేపీలో అగ్ర నాయకుల ఆథిపత్యం ఈనాటిది కాదని, దశాబ్దాలుగా ఆ పార్టీని వెంటాడుతోందని వారంటున్నారు. ముందస్తు ఎన్నికల సమయంలో బిసీ కులాలకు అనుకూలంగా లేకపోతే భారతీయ జనతా పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని బిసీ నాయకులు అంటున్నారు. తెలంగాణలో ఏడు జిల్లాలలో ఓబీసీ మోర్చ కమిటీలనే ఇంత వరకూ నియమించలేదని, ఇది బిజేపీలో అగ్ర కుల ఆథిపత్యాన్ని తెలియజేస్తుందని వారంటున్నారు.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కింగ్ అయినా, కింగ్ మేకర్ అయినా బిసీలకే ఆ ఘనత దక్కాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రానున్న ఎన్నికలలో బిజేపీకి మెజారిటి వస్తే బిసీ నాయకుణి ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రకటించాలని ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు నరిసింహాయాదవ్ డిమాండ్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖలో డా. లక్ష్మణ్, బండారు దత్తాత్రేయా, బద్దం బాల్‌రెడ్డి వంటి సినీయర్ నాయకులు ఉన్నారు. వీరంతా ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. వీరికి కూడా బిజేపీలో అంతర్గతంగా పెరుగుతున్న అగ్రకుల ఆథిపత్యంపై ఆగ్రహం ఉంది. పార్టీని ప్రక్షాళన చేసి బిసీలు, దళితుల పార్టీగా భారతీయ జనతా పార్టీకి గుర్తింపు తీసుకు రావాలని చాల మంది నాయకులు ఆశిస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు