మ‌జ్లిస్ ను మోస్తున్న టీఆర్ఎస్‌కి కుదుపు

మ‌జ్లిస్ ను మోస్తున్న టీఆర్ఎస్‌కి కుదుపు

" వచ్చే ఎన్నికలలో మజ్లీస్ పార్టీతో పొత్తు ఉంటుంది.  స్నేహమైన ఉంటుంది.   భారతీయ జనతా పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితికి ఎలాంటి స్నేహం లేదు. లోపాయికారి ఒప్పందం కూడా ." ఈ మాటలన్నది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది కూడా ముందస్తు ఎన్నికల ప్రకటన తర్వాత.

రానున్న ఎన్నికలలో తెలంగాణలో 105 మంది అభ్యుర్దులను ప్రకటించిన కె. చంద్రశేఖర రావు మజ్లీస్‌తో స్నేహంపై కుండ బద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలకు అనుగుణంగానే మజ్లీస్ పార్టీకి బలమున్న పాతబస్తీలో తెరాస అభ్యర్దులను ప్రకటించలేదు. ఒక వేళ మజ్లీస్‌తో పొత్తు కుదిరితే పాత బస్తీలో అభ్యర్దులను ప్రకటించాలని చంద్రశేఖర రావు వ్యూహం.

తెరాస, మజ్లీస్ పార్టీల మధ్య స్నేహం ఉందని భారతీయ జనతా పార్టీ గత కొన్నాళ్లుగా చేస్తున్న ఆరోపణలకు కేసీఆర్ వ్యాఖ్యలు, చర్యలు బలాన్ని చేకూర్చాయి. ఇప్పటి వరకూ అంతా సవ్యంగానే ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి రాజకీయ వర్గాలలో కొత్త చర్చకు తెర లేచింది. దీనికి మజ్లీస్ పార్టీ నాయకుడు చేసిన సంచలన వ్యాఖ్యలే కారణం అయ్యాయి.

ప్రతి శుక్రవారం నాడు పాత బస్తీలో మజ్లీస్ పార్టీ కార్యకర్తల సమావేశమో, బహిరంగ సభనో నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాలలో భారతీయ జనతా పార్టీని ఎండకట్టడమే ఎక్కువగా జరుగుతుంది. అయితే శుక్రవారం నాటి మజ్లీస్ సమావేశం మాత్రం తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది. మజ్లీస్ నాయకుడు అక్బరుద్దిన్ ఓవైసీ శుక్రవారం నాటి సమావేశం లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవి ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికే ఎసరు పెట్టాయి. కర్నాటకలో బలం తక్కువగా ఉన్న కుమార స్వామి ముఖ‌్యమంత్రి కాగా లేనిది, తెలంగాణలో తాము ఎందుకు కాలేమని సంచలన‌ వ్యాఖ‌్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మజ్లీస్ పార్టీలోనే కాదు, తెరాస లోను కలకలం రేపాయి. " ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్‌లో ఎన్నికలు వస్తాయని అంటున్నారు. డిశంబరులో తాను ముఖ్యమంత్రిని అవుతానని అంటున్నారు. నవంబరులో ఎన్నికలు రావడం నిజమే. డిశంబరులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నదే పెద్ద ప్రశ్న." అని అక్బరుద్దిన్ ఓవైసీ అన్నారు.

కర్నాటకలో కుమార స్వామి ముఖ్యమంత్రి అయినట్టుగా తెలంగాణలో తాము ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పేరు. దీనర్దం తెలంగాణలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, మజ్లీస్ పార్టీ గెలిచే స్థానాలే కీలకం అవుతాయని చెప్పకనే చెప్పారు.

అయితే, టీఆర్ఎస్ గ‌త కొంత కాలంగా మ‌జ్లిస్‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తోంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే... నెత్తిమీద పెట్టుకుంద‌ని చెప్పొచ్చు. కిర‌ణ్‌కుమార్ రెడ్డి హ‌యాంలో సీఎం పోస్టు ప‌వ‌ర్ ఏంటో చూసిన మ‌జ్లిస్ నేత‌లు అస‌లు మేమే సీఎం అయితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. అందుకే సంకీర్ణానికి ఇపుడు తెలంగాణలో అవ‌కాశం ఉంద‌ని తేల‌డంతో ఆ పార్టీ విజృంభిస్తోంది. ఇంత‌కాలం మ‌జ్లిస్ మ‌ద్ద‌తు ఇస్తుంది మాకు అనుకున్న కేసీఆర్‌కు ఏకంగా వారు సీఎం పోస్టు మీదే క‌న్నేయ‌డంతో టీఆర్ఎస్ ఖంగుతిన్న‌ది.
 
ఇక‌ పాత బస్తీలో మజ్లీస్ పార్టీ ఏడు లేక ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంటుంది. గత ఎన్నికలను పరిశీలిస్తే పాత బస్తీలో మజ్లీస్‌దే ఎప్పుడూ పైచేయి. ముందస్తు ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటి రాక మజ్లీస్ సాయం తీసుకోవల్సి వస్తే ఆ పార్టీ పెట్టే మొదిటి డిమాండ్ ముఖ్యమంత్రి పదవే. ఈ డిమాండ్‌కు కేసీఆర్‌ అయినా, కాంగ్రెస్ అయినా తల వంచాల్సిందే. సరిగ్గా సరైన సమయంలో తెలంగాణలో రాజకీయ పార్టీలను తన వ్యాఖ్యలతో ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు అక్బరుద్దిన్‌ ఓవైసీ. దీంతో రానున్న ఎన్నికలు, అనంతర ఫలితాలు రసకందాయంలో
పడనున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English