కేసీఆర్‌కు షాకిచ్చిన నారాయణ

కేసీఆర్‌కు షాకిచ్చిన నారాయణ

తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన... శోభనం గదిలోంచి పారిపోయిన పెళ్లికొడుకంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల పట్ల కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన కుసంస్కారానికి నిదర్శనమని  నారాయణ అన్నారు.. అర్థాంతరంగా అసెంబ్లీని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్‌ తీరు శోభనం గది నుంచి అర్థరాత్రి పారిపోయిన పెళ్లికొడుకు తరహాలో ఉందని నారాయణ కామెంట్స్ చేశారు. శోభనం గది నుంచి పారిపోయిన పెళ్లికొడుకు ఇప్పుడు మరోసారి పెళ్లి చేయండి సత్తా చూపిస్తా అన్నట్టుగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని కూడా తానే చేసి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడానికి ఆయన అభ్యంతరం చెప్పారు. శుక్రవారం నారాయణ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో కలసి ఆయన ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ ను కలిశారు.  ఈ మేరకుఒక వినతి పత్రం సమర్పించారు. అసెంబ్లీరద్దు తర్వాత కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ  ఎన్నికల కమిషనర్ తో మాట్లాడినట్లు అబద్దం చెప్పారని నారాయణ అన్నారు. తాను ఎన్నికల కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడానని,  ఆ సంభాషణ ప్రకారం, సెప్టంబర్ లో నోటిఫికేసన్ వెలువడుతుంది,నవంబర్ లో ఎన్నికలుంటాయ, డిసెంబర్ ఫలితాలొస్తాయని కేసీఆర్ చెప్పారని.. కానీ, ఎన్నికల కమిషనర్ అలా ఎలా చెప్తారని నారాయణ ప్రశ్నించారు. కెసియార్ ఎన్నికల ప్రధాన కమిషనర్ తో మాట్లాడటం అబద్దం అని నారాయణ చెప్పారు.

ఎన్నికల కమిషన్ ను కూడా కెసిఆర్ అవమానపర్చారని, ప్రధాని పంచన తానున్నాను, తనకు అడ్డు లేదని కెసిఆర్ భావిస్తున్నారని, ఏమి చేసినా చెల్లుతుందని భావిస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆయన కు బుద్ధి చెబుతారని అన్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు