‘లోకేశ్ ఎవరికి పుట్టిన బిడ్డ?’.. టీఆరెస్ నేత తీవ్ర వ్యాఖ్య

‘లోకేశ్ ఎవరికి పుట్టిన బిడ్డ?’.. టీఆరెస్ నేత తీవ్ర వ్యాఖ్య

ఏపీ సీఎం తనయుడు, ఏపీ మంత్రి అయిన లోకేశ్‌పై ఉద్యోగుల నేత, టీఆరెస్ నాయకుడు దేవీప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై లోకేశ్ విమర్శలు చేయడంతో దేవీప్రసాద్ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ‘లోకేశ్ ఎవరికి పుట్టిన బిడ్డ?’ అంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.. అంతలోనే కాంగ్రెస్‌కు పుట్టిన బిడ్డే కదా అంటూ తీవ్రత తగ్గించారు.

టీడీపీ నుంచి గెలిచిన వారిని కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకున్నారని లోకేష్ చేసిన విమర్శలపై టీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ తీవ్రంగా స్పందించారు. టీడీపీలో ఉండడం ఇష్టంలేని వారు టీఆర్ఎస్‌లో చేరిన మాట నిజమేనన్నారు. "అసలు ఎవరికి పుట్టిన బిడ్డ లోకేష్ ?… కాంగ్రెస్‌కు పుట్టిన బిడ్డ కాదా?" అని దేవిప్రసాద్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ లోకి టీడీపీ ఎమ్మెల్యేలు వస్తే అభ్యంతరం చెబుతున్న లోకేష్ మరి ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకుని పక్కన ఎలా కూర్చోబెట్టుకున్నారని ప్రశ్నించారు. ప్రతి ఒక్క పార్టీతోనూ పొత్తు పెట్టుకున్న పార్టీ టీడీపీ అని విమర్శించారు. ఇక అక్రమ సంబంధానికి ఇంతకంటే డిక్షనరీలో అర్థం ఉంటుందా అని దేవిప్రసాద్ ప్రశ్నించారు.

దశాబ్దాలుగా కాంగ్రెస్ వ్యతిరేక భావాల మీద బతికిన టీడీపీ ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తుపెట్టుకోవడం ఏమిటని నిలదీశారు. ఏపీలో టీడీపీ గెలిచే అవకాశం లేదని…. అందుకే ఏపీలో కాంగ్రెస్‌కు అధికార ప్రతినిధిగా చంద్రబాబు మారి… రోజురోజుకు కాంగ్రెస్‌ ఏపీలో బలపడుతోందంటూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో కాంగ్రెస్‌ బలపడుతోందని… రఘువీరారెడ్డి కూడా చెప్పలేకపోతున్నారని… కానీ కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమవుతున్న చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ బలపడుతోందంటూ వకాల్తాపుచ్చుకుని పనిచేస్తున్నారన్నారు. టీడీపీతో పొత్తు తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒకటి రెండు సీట్లు కూడా వచ్చే అవకాశం ఉండదన్నారు.

మోడీ, కేసీఆర్ మధ్య అక్రమసంబంధమే ఉంటే నాలుగేళ్లుగా చంద్రబాబు ఒక్కసారి కూడా ఆ మాట ఎందుకు చెప్పలేకపోయారని దేవిప్రసాద్ ప్రశ్నించారు. చంద్రబాబు పంపిన కోవర్ట్ రేవంత్ రెడ్డే ఇప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ మధ్య పొత్తు రాయబారం నడుతున్నారని ఎద్దేవా చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు