మోడీ.. కేసీఆర్ రిలేష‌న్ ఇప్ప‌టిది కాద‌ట‌!

మోడీ.. కేసీఆర్ రిలేష‌న్ ఇప్ప‌టిది కాద‌ట‌!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు. తాజాగా తెలంగాణ ర‌ద్దునేప‌థ్యంలో పార్టీ నేత‌ల‌తో భేటీ అయిన ఆయ‌న‌.. తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చ‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ర‌ద్దు కోస‌మే కేసీఆర్ ప్ర‌ధాని మోడీకి ద‌గ్గ‌ర‌య్యార‌న్న మాట సమావేశంలో  చ‌ర్చ‌కు రాగా.. బాబు  ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు. నిజానికి మోడీ.. కేసీఆర్ ల మ‌ధ్య అనుబంధం ఇప్ప‌టిది కాద‌ని.. చాలా పాత‌ద‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

మోడీ.. కేసీఆర్ ల మ‌ధ్య అనుబంధం ఇప్ప‌టిది కాద‌ని..చాలా పాత‌ద‌న్న మాట బాబు చెప్పిన‌ట్లుగా స‌మాచారం. ముంద‌స్తు నేప‌థ్యంలోనే మోడీ.. కేసీఆర్ లు ద‌గ్గ‌ర‌య్యార‌ని భావించ‌టం త‌ప్పంటూనే.. మోడీషాలు రూపొందించిన వ్యూహాల్ని కొన్నేళ్లుగా కేసీఆర్ అమ‌లు చేస్తున్నార‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

కొద్దికాలం క్రితం కేసీఆర్ ప్ర‌క‌టించిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ సైతం మోడీ మాన‌స‌పుత్రిగా చెప్పిన‌ట్లుగా స‌మాచారం. మోడీ వ్యూహాన్ని కేసీఆర్ అమ‌లు చేస్తున్నారంతేన‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ట్లుగా స‌మాచారం. బీజేపీని వ్య‌తిరేకిస్తున్న ప్రాంతీయ‌పార్టీల‌న్నింటికి కాంగ్రెస్ వ‌ద్ద‌కు చేర‌కుండా చేసే వ్యూహంలో భాగ‌మే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మాట అని .. మ‌రో కూట‌మిగా ఉంచ‌టానికే దీన్ని తెర మీద‌కు తీసుకొచ్చిన‌ట్లుగా చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌తిపక్షం రెండు.. మూడు ముక్క‌లుగా మారితే బీజేపీ లాభ‌ప‌డొచ్చ‌న్న అభిప్రాయంతోనే ఈ ఫ్రంట్ ను కేసీఆర్ తెర మీద‌కు తీసుకొచ్చార‌న్న విశ్లేష‌ణ స‌మావేశంలో వ్య‌క్త‌మైన‌ట్లుగా తెలుస్తోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల వేళ‌.. జేడీఎస్ కు కేసీఆర్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌టం కూడా బీజేపీ వ్యూహంలోని భాగంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. విప‌క్షాల ఓట్లు చీలితో ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తామ‌ని మోడీషాలు అంచ‌నా వేశార‌ని.. తెలుగు ఓట‌ర్లంతా ఐక్యంగా ఉండి.. బీజేపీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించ‌టంతో మోడీషాల వ్యూహం ప‌లించ‌న‌ట్లుగా బాబు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి చెప్పిన వేళ‌.. కేసీఆర్ నోటి నంచి మోడీని గాడు అని సంబోధించి.. ఆ త‌ర్వాత దాన్ని మార్చేసిన వైనం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు