మేన‌ల్లుడి పుణ్య‌మా అని కేసీఆర్ ఫుల్ హ్యాపీ!

మేన‌ల్లుడి పుణ్య‌మా అని కేసీఆర్ ఫుల్ హ్యాపీ!

అనుకుంటాం కానీ కేసీఆర్ కూడా మామూలు అధినేత‌నే. కొన్ని విషయాల్ని ఆయ‌న ఎంత దాచుకోవాల‌న్నా దాచుకోలేని వ్య‌క్తిగా క‌నిపిస్తారు. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ ఫ్లాప్ షో కావ‌టంతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆయ‌న‌కు తాజాగా నిర్వ‌హించిన హుస్నాబాద్ స‌భ స‌క్సెస్ కావ‌టంతో ఆయ‌న హ్యాపీగా ఉన్నారు.

భారీ బ‌డ్జెట్ తో నిర్వ‌హించిన ప్ర‌గ‌తి నివేద‌న స‌భ కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాద‌న్న మాట వినిపిస్తోంది. పార్టీ శ్రేణులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డేలా చేయ‌ట‌మే కాదు.. ముంద‌స్తుకు వెళుతున్న వేళ‌.. నీర‌సంగా సాగిన ప్ర‌గ‌తి నివేద‌న గులాబీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లాన్ని రేపాయి.

కొంగ‌ర క‌లాన్ షాక్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు వీలుగా.. తన‌కు అచ్చొచ్చిన హుస్నాబాద్ ను ఎంపిక చేసుకున్నారు కేసీఆర్‌. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు అప్ప‌జెప్పిన‌ట్లుగా కేటీఆర్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌కుండా హ‌రీశ్‌పైన మొత్తం భారం పెట్టేశారు. మ‌రో సీనియ‌ర్ నేత ఈటెల‌నుకూడా ప‌ర్య‌వేక్షించ‌మన్నారు.

జ‌న స‌మీక‌ర‌ణ విష‌యంలోనూ.. కొన్ని వ్య‌వ‌హారాల్ని చ‌క్క‌బెట్ట‌టంలోనూ హ‌రీశ్‌కున్న స‌త్తా అంతా ఇంతా  కాద‌న్న వాద‌న‌కు త‌గ్గ‌ట్లే హుస్నాబాద్ స‌భ ఏర్పాట్ల విష‌యంతో త‌న స‌త్తా చాటారు. హెలికాఫ్ట‌ర్ లో హుస్నాబాద్ స‌భ‌కు చేరుకున్న కేసీఆర్‌.. స‌భ‌కు వెల్లువ‌లా వ‌చ్చిన భారీ జ‌న సందోహానికి ఫిదా అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ కార‌ణంతోనే త‌న మ‌న‌సులోని ఆనందాన్ని దాచుకోకుండా బ‌య‌ట‌కు క‌క్కేశారు.

త‌న తొలి ఎన్నిక‌ల ప్ర‌చార స‌భా వేదిక అయిన హుస్నాబాద్ స‌భ‌లో కాంగ్రెస్ ను బండ‌కేసి బాదిన‌ట్లుగా తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన కేసీఆర్‌..ఊహించిన దాని కంటే ఎక్కువ జ‌నాల్ని చూస్తుండ‌టం త‌న‌కెంతో సంతోషాన్ని క‌లిగించిన‌ట్లుగా వెల్ల‌డించారు. త‌న మాట‌ల‌తో హ‌రీశ్ స‌త్తాను కేసీఆర్ గుర్తించిన‌ట్లుగా చెబుతున్నారు. స‌భ‌ను స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హించ‌టంలో  కొడుక్కి చేత‌కాని ప‌నిని మేన‌ల్లుడు స‌క్ఎస్ ఫుల్ గా పూర్తి చేసిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English