ఏపీలో హోట‌ళ్ల టైం పెరిగిందోచ్!

ఏపీలో హోట‌ళ్ల టైం పెరిగిందోచ్!

ఏపీ స‌ర్కారు ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు.. మున్సిపాలిటీల‌లో ఉన్న హోట‌ళ్ల ప‌ని గంట‌ల విష‌యంలో కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం రాత్రి 10.30 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే తెరిచి ఉంచే నిబంధ‌న ఉంది.

ఇటీవ‌ల కాలంలో వ్యాపార అవ‌కాశాలు పెర‌గ‌టం.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో వ‌స్తున్న మార్పుల‌తో పాటు.. ప‌ర్యాట‌కుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో హోట‌ళ్ల ప‌ని గంట‌ల్ని పెంచేలానిర్ణ‌యం తీసుకోవాలంటూ ప్ర‌భుత్వంపై హోట‌ల్ య‌జ‌మానులు ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా దీనిపై ఏపీ మంత్రి పితాని స‌త్యానార‌య‌ణ స్పందించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు.. మున్సిపాలిటీల్లో హోట‌ళ్ల‌ను అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కూ తెరిచి ఉంచేలా అనుమ‌తి ఇచ్చిన‌ట్లు ప్ర‌క‌టించారు. హోట‌ల్ నిర్వ‌హ‌కుల అసోసియేష‌న్ విన‌తి మేర‌కు తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. అయితే.. మారిన నిర్ణ‌యం కార‌ణంగా హోట‌ళ్ల‌లో ప‌ని చేసే సిబ్బందిపై అద‌న‌పు ప‌ని భారం ప‌డ‌కుండా ఉండాల‌న్న నిబంధ‌న‌ను అమ‌లు చేయ‌నున్నారు.

గ‌తంలో ఉన్న 8 గంట‌ల ప‌ని వేళ‌ల విష‌యంలో ఎలాంటి మార్పు ఉండదు. అంతేకాదు.. అర్థ‌రాత్రి వ‌ర‌కూ సేవ‌లుఅందించే సిబ్బందికి  ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించేందుకు హోట‌ళ్ల యాజ‌మాన్యాలు అంగీక‌రించిన‌ట్లుగా చెబుతున్నారు. సో.. ఏపీలో అర్థ‌రాత్రి వ‌ర‌కూ హోట‌ళ్ల‌కు అవ‌కాశం ఉంద‌న్న మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English