జ‌గ‌న్.. నీ దగ్గ‌రకు వ‌చ్చిన‌ప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చావ్‌?

జ‌గ‌న్.. నీ దగ్గ‌రకు వ‌చ్చిన‌ప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చావ్‌?

అస‌లే ఆది.. ఆయ‌న‌కు కానీ ఆగ్ర‌హం వ‌స్తే ఏమువుతంది? అంటే.. తాజాగా ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. ఇటీవ‌ల కాలంలో వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడుతున్న జ‌గ‌న్ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి.

తాము జ‌గ‌న్ వ‌ల్లే గెలిచిన‌ట్లుగా చెప్పుకునే వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల తీరును తీవ్రంగా మండిప‌డ్డ ఆది.. ఒక‌వేళ విశాఖ‌లో విజ‌య‌మ్మ త‌న వ‌ల్లే ఓడిపోయింద‌ని ఒప్పుకున్న ప‌క్షంలో తాము జ‌గ‌న్ వ‌ల్ల గెలిచామ‌ని ఒ్పుకుంటామ‌ని పాయింట్ బ‌య‌ట‌కు తీశారు. త‌మ వంశ చ‌రిత్ర గురించి జ‌గ‌న్ మాట్లాడితే.. అత‌డి చ‌రిత్ర‌ను వంద‌సార్లు చెబుతాన‌న్నారు.

తాము ఊర‌కుక్క‌ల‌మైతే.. జ‌గ‌న్ ఊర‌పంది అంటూ తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. త‌న తండ్రి ఎమ్మెల్యేగా ప‌ని చేసిన‌ప్పుడు జ‌గ‌న్ అప్ప‌టికి పుట్ట‌లేద‌న్నాది.. తాను ఎమ్మెల్యేగా జ‌గ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ఆ రోజు ఎమ్మెల్యేల ఫిరాయింపులు గుర్తుకు రాలేదా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. పార్టీ మారినందుకు త‌న‌కు రూ.20 కోట్లు టీడీపీ ఇచ్చిన‌ట్లుగా ప్ర‌చారం చేస్తున్నార‌ని.. గ‌తంలో తానుజ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చావో చెప్పాల‌ని విప‌క్ష నేత‌ను నిల‌దీశారు.

ఎవ‌రి చ‌రిత్ర ఏమిటో ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నాటి చ‌రిత్ర ఏమిటో చెబితే జ‌గ‌న్ పారిపోతార‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. జ‌గ‌న్ పై ఆది తీవ్ర ఆగ్ర‌హంతో చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ఫైర్ బ్రాండ్ నేత‌గా చెప్పే ఆది నోరు విప్పితే ఈ త‌ర‌హా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఉంటాయ‌ని.. ఆయ‌న్ను మ‌రింత కోపం వ‌చ్చేలా చేస్తే.. జ‌గ‌న్ నోటి నుంచి మాట‌లు కూడా రాలేని నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్న మాట టీడీపీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు