సుప్రీం తీర్పుపై స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

సుప్రీం తీర్పుపై స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ప‌ర‌స్ప‌ర అంగీకారంతో జ‌రిగే స్వలింగ సంపర్కం సెక్షన్ 377 పరిధిలోకి రాదని సుప్రీం కోర్టు నేడు సంచ‌ల‌న తీర్పునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎల్ జీ బీ టీ(లెస్బియ‌న్స్...గేస్...బై సెక్సువ‌ల్స్...ట్రాన్స్ జెండ‌ర్స్)ల‌ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరముందని, అందరితోపాటు వారికీ సమాన హక్కులుంటాయని స్ప‌ష్టం చేసింది. ఈ చరిత్రాత్మ‌క తీర్పుపై ఎల్ జీ బీ టీ క‌మ్యూనిటీ హ‌ర్షం వ్య‌క్తం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, మ‌రోవైపు, ఈ తీర్పుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హోమో సెక్సువాలిటీ అనేది జన్యుపరమైన రుగ్మత అని, ఈ తీర్పు వల్ల హెచ్ఐవీ కేసులు పెరిగే అవకాశం ఉందని స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప‌ర‌స్ప‌ర అంగీకారంతో స్వలింగ సంపర్కం చేయడం నేరం కాదని చెప్పడం వల్ల సాంఘిక దురాచారాలు , లైంగిక సంక్రమణ వ్యాధులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ తీర్పు అంతిమం కాదని, ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనిని రద్దు చేయవచ్చని అన్నారు.

మ‌రోవైపు, ఈ తీర్పుపై ఆర్ఎస్ఎస్ పెద‌వి విరిచింది. స్వ‌లింగ  సంప‌ర్కం, స్వ‌లింగ వివాహాలు ప్రకృతి విరుద్ధమనీ..అలాంటి సంబంధాలు స‌భ్య స‌మాజంలో ఏమాత్రం ఆమోద యోగ్యం కాద‌ని ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ అరుణ్ కుమార్ తెలిపారు. తాము కూడా అత్యున్న‌త న్యాయ‌స్థానం చెప్పిన‌ట్టు చెప్పినట్టు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం లేదన్నారు. కానీ, స్వ‌లింగ సంప‌ర్కం ప్ర‌కృతి విరుద్ధ‌మ‌ని, అందుకే తాము మద్దతు ఇవ్వడం లేద‌ని చెప్పారు. సంస్కృతీసంప్ర‌దాయాల‌కు నెల‌వైన భారత సమాజం ఇటువంటి సంబంధాల‌ను గుర్తించదన్నారు. ఎవ‌రైనా ఓ వ్యక్తి దీన్ని అనుభవపూర్వకంగానే నేర్చుకోగలుగుతాడని, ఇది సామాజిక, మానసిక స్థాయిల్లో ఆలోచించాల్సిన విషయమ‌ని అరుణ్ పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు