కాంగ్రెస్‌ని కడిగెయ్‌ బాసూ

కాంగ్రెస్‌ని కడిగెయ్‌ బాసూ

తెలంగాణ ఇచ్చేదెవరన్న ప్రశ్నకు సమాధానం టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌కి బాగా తెలుసు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి వల్లనే తెలంగాణ సాధ్యమవుతుంది. కాని, విచిత్రంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటైన తెలుగుదేశం పార్టీని విమర్శిస్తుంటారు కెసిఆర్‌. అది ఆయన రాజకీయ వ్యూహం. టిడిపిని దెబ్బ కొట్టాలనే రాజకీయ వ్యూహానికి తెలంగాణ రంగు పులుముతూ 'గులాబీ బాస్‌' తన ప్రాబల్యం పెంచుకుంటున్నారు.

ఎవరేమనుకున్నా కాంగ్రెసు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నది ఈ కెసిఆరే. ఎందుకో కెసిఆర్‌కి, కాంగ్రెస్‌కి మధ్య వివాదం పెరిగి, కెసిఆర్‌, కాంగ్రెసుని తిట్టడం షురూ చేశారు. కాంగ్రెసు, టిడిపిలను ఎండగడితేనే తెలంగాణ అనే కొత్త పల్లవి అందుకున్నారాయన. పోని, బిజెపితో జతకడతారా? అంటే అదీ లేదు. స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగితేనే తెలంగాణ వస్తుందని కెసిఆర్‌ నమ్మబలుకుతున్నారు. 2014 ఎన్నికలు లక్ష్యమని అంటున్నారు.

అలా స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగినా తెలంగాణ వచ్చుడు కష్టని టి.వాదులే కొందరు కెసిఆర్‌ తీరును తప్పుపడుతుంటే, వారిపై 'సమైక్యవాదులకు తొత్తులు' అన్న ముద్ర వేసి ఫామ్‌ హౌస్‌కి వెళ్ళిపోవడం కెసిఆర్‌కే చెల్లుతున్నది. కాంగ్రెస్‌ని విమర్శించి ఊరుకుంటే కుదరుదు, నిలదీయాలి. ఆ నిలదీసే కార్యక్రమాలు చేపట్టడానికి కెసిఆర్‌ దగ్గర వ్యూహమే లేనట్టుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు