రాజీనామా చేసి మ‌రీ కేసీఆర్‌ను వాయించిన రేవంత్

రాజీనామా చేసి మ‌రీ కేసీఆర్‌ను వాయించిన రేవంత్

తెలంగాణ రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం సమావేశం కానున్న కేబినెట్‌... అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మానం చేయనుండగా... ఆ తర్వాత రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి సీఎం కేసీఆర్ తీర్మానం అందజేయనున్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన గులాబిదళపతి... అసెంబ్లీ రద్దు గల కారణాలను వివరించ‌నున్నారు. ఇలా ఓ వైపు ముందస్తు ఎన్నికల ఎత్తుగ‌డ‌ల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ వేస్తుంటే...మ‌రోవైపు అన్ని రాజకీయ పార్టీలూ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. కాగా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎత్తుల ప‌ర్వంలోనే... కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మ‌రో ట్విస్ట్ జోడించారు. త‌న ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేశారు.

కేబినెట్ భేటీ, విలేక‌రుల స‌మావేశం, అనంత‌రం గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ వంటి ప్ర‌ణాళిక‌ల‌తో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతుండ‌గానే...రేవంత్ ఎంట్రీ ఇచ్చారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖను మధుసూదనాచారికి అందజేశారు. అనంత‌రం గాంధీభ‌వ‌న్‌లో విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేస్తున్న‌ట్లు తెలిపారు. కేసీఆర్ పిచ్చి చేష్టలతో రాష్ట్రం నష్టపోతోంద‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేసీఆర్ జాతకం బాగాలేకపోతే...రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేసీఆర్ తీరుకు నిరసనగానే నా రాజీనామా అని ఆయ‌న ప్ర‌క‌టించారు. తాను కాంగ్రెస్‌లో చేరినప్పుడే ..ఎమ్మెల్యేకు, టీడీపీకి రాజీనామా చేశాన‌ని, ఆ పత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు అందించాన‌ని వివ‌రించారు. ఆనాటి నుండి ఈ రోజు వరకు ఎమ్మెల్యేగా జీతభత్యాలు తీసుకోవ‌డం లేదని, తన గన్‌మెన్ లను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశాన‌ని రేవంత్ రెడ్డి వివ‌రించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు