బ్రేకింగ్:తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు!

బ్రేకింగ్:తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు!

ఈ రోజు మ‌ధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు కాబోతోందంటూ వ‌స్తోన్న ఊహాగానాలు నిజ‌మ‌య్యాయి. తెలంగాణ‌లో ముందుస్తుకు వెళ్లే యోచ‌న‌లో ఉన్న సీఎం కేసీఆర్....అసెంబ్లీని ర‌ద్దుచేశారు. హైదరాబాద్ ప్రగతిభవన్ లో జరిగిన టీ-కేబినెట్ భేటీలో కేసీఆర్ కేబినెట్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ర‌ద్దు ఏక వాక్య తీర్మానంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

5 నిమిషాల పాటు జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. అంత‌కుముందు నిర్ణయించిన సమయానికే ఈ తీర్మానంపై కేసీఆర్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆ వెంట‌నే కేసీఆర్ ....ఆ తీర్మాన ప్రతిని గవర్నర్ నరసింహన్ కు అంద‌జేశారు. రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్, మంత్రులు.... కేబినెట్ నిర్ణయం ప్ర‌కారం అసెంబ్లీని రద్దుచేయాలని కోరారు.

వారం రోజులుగా తెలంగాణ‌లో ముంద‌స్తు పై ఏర్ప‌డిని ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. సస్పెన్స్ కు కేసీఆర్ తెర‌దించి అసెంబ్లీని ర‌ద్దు చేశారు. ఈ ప్ర‌కారం కేబినెట్ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ తీర్మానాన్ని గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కు స‌మ‌ర్పించిన కేసీఆర్ ....కొద్ది సేప‌ట్లో టీఆర్ఎస్ భవన్ లో  ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని అధికారికంగా ఈ ప్రెస్ మీట్ లో కేసీఆర్ వెల్ల‌డించ‌నున్నారు. కాగా, కేబినెట్ తీసుకున్న తీర్మానం రాజ్ భవన్ నుంచి అసెంబ్లీ సెక్రటరీకి చేరుతుంది. ఆ త‌ర్వాత అసెంబ్లీ సెక్రటరీ....అసెంబ్లీ ర‌ద్ద‌యిన‌ట్లు ప్ర‌క‌టిస్తారు. ఆ ప్ర‌కటన వెలువడిన వెంట‌నే అసెంబ్లీ రద్దవుతుంది. ఆ త‌ర్వాత తెలంగాణ ఎన్నికల సంఘం తన కార్య‌చరణను మొదలుపెడుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు