లేఖ‌తో జ‌గ‌న్ కు మాజీల భారీ షాక్‌

లేఖ‌తో జ‌గ‌న్ కు మాజీల భారీ షాక్‌

చెంప‌కు చేయి ప‌ర‌మైన‌ప్పుడు కంటికి నీరు ఆదేశ‌మ‌వున్ అన్న మాట‌ను చిన్న‌ప్పుడు విన్న మాట ఏపీ తాజా రాజ‌కీయ ప‌రిణామాలు చూసిన‌ప్పుడు చ‌ప్పున గుర్తుకు వ‌చ్చింది. అధికార‌ప‌క్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఎలాంటి అవ‌కాశాలు ఉన్నాయ‌న్న దానిపై నెల‌ల త‌ర‌బ‌డి శోధించి.. శోధించిన ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఒక లేఖ‌ను రిలీజ్ చేసింది.

తెలుగుదేశం పార్టీని.. అధినేత క‌మ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును టార్గెట్ చేసేలా లేఖ సారాంశం ఉంది. గురివింద‌న‌ను త‌ల‌పించేలా వ్య‌వ‌హ‌రించే జ‌గ‌న్ కు.. ఆయ‌నే మాత్రం ఊహించ‌ని రీతిలో ఆయ‌న పార్టీని వీడిన ఎమ్మెల్యేలు ప‌లువురు ఓపెన్ అయ్యారు. అస‌లు మేమంతా జ‌గ‌న్ పార్టీని ఎందుకు విడిచి పెట్టి టీడీపీలో చేరామో తెలుసా? అంటూ వారో లేఖ రాశారు.

అందులో..జ‌గ‌న్ ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. అహంకారంతో జ‌గ‌న్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు.

జ‌గ‌న్ ను ఉద్దేశించి ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎమ్మెల్యేలు రాసిన లేఖ‌ను వారి మాట‌ల్లోనే చూస్తే..

- ‘‘మీ ఫ్యూడల్‌ వ్యవహార శైలి నచ్చకే బయటికి వచ్చాం. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ పని చేస్తున్న ముఖ్యమంత్రిని బలపరిచేలా అడుగులు వేశాం’’

- ‘‘వయసు లేదు, అనుభవం లేదు, స్వతహాగా వినే నైజం లేదు. కేవలం సహ నిందితుల సలహాలతోనే ముందుకు సాగాలన్న మీ ఆలోచన భరించలేక... అధికారమే పరమావధిగా, కుట్ర రాజకీయాలే ప్రధాన అజెండాగా కొనసాగిస్తూ, ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూసే నీచ మనస్తత్వాన్ని సహించలేక బయటకు వచ్చేశాం’’

- "పట్టిసీమ.. పోలవరం ప్రాజెక్టుల‌ను అడ్డుకోవాలని, కొత్త రాజధానిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయనివ్వకూడదని అంతర్గత సమావేశాల్లో చేసిన ఆదేశాలను జీర్ణించుకోలేకపోయాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామని రాజ్‌భవన్‌ సాక్షిగా మీరు చేసిన ప్రకటనను సహించలేకపోయాం"

- ‘‘కేసుల మాఫీ కోసం కేంద్రంతో మీ చీకటి ఒప్పందాలు, బీజేపీతో మీ పార్టనర్‌షిప్‌ చూసి సహించలేకే దూరమయ్యాం. ఫ్యాక్షన్‌ పునాదుల మీద నిర్మించిన మీ ఫ్యూడల్‌ మనస్తత్వాన్ని సమర్థించలేక, మానసిక సంఘర్షణ భరించలేక వచ్చేశాం"

-  "మీ నాన్న రాజకీయ పుట్టుకే ఫిరాయింపుతో మొదలైందని గుర్తులేదా? ఆనాడు సభలో నాటి ప్రతిపక్షనేత భాట్టం శ్రీరామమూర్తి మీ నాన్నపై చేసిన వ్యాఖ్యలు తెలుసా? మధుపర్కాలతో మంగళ సూత్రాలతో పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయిన కొత్త పెళ్లి కూతురిలా నీ (మర్రి చెన్నారెడ్డి) వైపు వెళ్లాడు మా రాజశేఖర రెడ్డి! ఏముంది నీలో ఆకర్షణ?’’ అని భాట్టం అన్నారు. 1978లో రెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన వైఎస్‌... రాజీనామా చేయకుండానే ఇందిరా కాంగ్రెస్‌లో చేరి మంత్రి కాలేదా?"

-  "1993లో ఏడుగురు టీడీపీ ఎంపీలను కాంగ్రెస్‌లోకి లాక్కొన్నప్పుడు ఈ విలువలు ఏమయ్యాయి? 2004లో 16 మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను వైఎస్‌ కాంగ్రెస్ లో చేర్చుకోలేదా? అణు ఒప్పందంపై పార్లమెంటులో ఓటింగ్‌ సందర్భంగా ఇద్దరు టీడీపీ ఎంపీలను కాంగ్రెస్‌ వైపు మళ్లించలేదా? 2009లో బాలనాగిరెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డిలను తీసుకున్నప్పుడు ఎందుకు రాజీనామా చేయించలేదు? "

-  "మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? ఆ రోజు మీ తండ్రి ఎన్ని కోట్లకు అమ్ముడు పోయారు? మీ దగ్గరకొచ్చిన వాళ్లకు ఎన్ని కోట్లు ఇచ్చావు?’’

-   "మీ చేష్టలు నచ్చక మీ మీద తిరుగుబాటు చేసే ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరారు. మిగతా ఎమ్మెల్యేలను కూడా బలవంతంగా శాసనసభకు వెళ్లకుండా చేసిన మీకు నైతిక విలువలు గురించి మాట్లాడే అర్హత లేదు’’

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు