కేసీఆర్ కు ద‌న్నుగా జ‌గ‌న్‌.. ప‌వ‌న్‌!

కేసీఆర్ కు ద‌న్నుగా జ‌గ‌న్‌.. ప‌వ‌న్‌!

తెలంగాణ‌లో ముంద‌స్తు వ‌చ్చేసిన‌ట్లే. మ‌రో 24 గంట‌ల్లో ముంద‌స్తు స‌మ‌ర భేరీ అధికారికంగా మోగ‌నుంది. ఇప్ప‌టికే తెలంగాణ వ్యాప్తంగా రాజ‌కీయంగా ఉత్సాహభ‌రిత వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇంత‌కాలం బ‌ద్దంగా ఉన్న ప‌లువురు నేత‌లు హ‌డావుడిగా ఒళ్లు విరుచుకోవటంతో పాటు.. స‌న్న‌ద్ధ దిశ‌గా వేగంగా పావులు క‌ద‌ప‌టం మొద‌లెట్టారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పైకి క‌నిపించ‌ని శ‌క్తులు కొన్ని ముంద‌స్తులో కీల‌క‌భూమిక‌ను పోషిస్తాయ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ముంద‌స్తుకు వెళ్ల‌టం ద్వారా కేసీఆర్ భారీ త‌ప్పును చేస్తున్నారా? అని కొంద‌రు అనుమానిస్తున్నారు. వారి అనుమానానికి త‌గిన కార‌ణం లేక‌పోలేదు. సార్వ‌త్రికం అన్న‌ప్పుడు దేశ వ్యాప్తంగా ఎన్నిక‌లుజ‌రుగుతున్న‌వేళ‌లో.. తెలంగాణ మీద ప్ర‌త్యేకంగా దృష్టి ఎట్ట‌లేని ప‌రిస్థితి.

అదే ముంద‌స్తు అయితే.. బీజేపీ.. కాంగ్రెస్ తో స‌హా ప‌లు పార్టీలు త‌మ దృష్టి మొత్తాన్ని తెలంగాణ మీద ఫోక‌స్ పెట్టే వీలు ఉంటుంది. ఈ వ్య‌వ‌హారం కేసీఆర్ కు కొత్త క‌ష్టాన్ని తెచ్చి పెట్ట‌దా? అన్న అనుమానం ప‌లువురిలో ఉంది. అయితే.. ఈ ఇబ్బందిని అధిగ‌మించ‌టానికి కేసీఆర్ వ‌ద్ద రెండు అస్త్రాలు సిద్ధంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

కేసీఆర్ ద‌గ్గ‌రున్న అస్త్రాల్లో ఒక‌టి జ‌గ‌న్ అయితే.. రెండోది ప‌వ‌న్ గా చెబుతున్నారు. వీరిద్ద‌రి పుణ్య‌మా అని కేసీఆర్ ఈజీగా గెలిచేస్తార‌ని చెబుతున్నారు. అదెలానంటే.. తెలంగాణ‌లో ప్ర‌ముఖ రాజ‌కీయ పార్టీలుగా టీఆర్ఎస్‌.. కాంగ్రెస్‌.. బీజేపీ.. టీడీపీ.. టీజేఎస్‌.. జ‌న‌సేన‌.. వైఎస్సార్ కాంగ్రెస్‌..క‌మ్యునిస్ట్ పార్టీల‌తో పాటు మ‌జ్లిస్ ఉంది.

ఇన్ని పార్టీల మ‌ధ్య పోటీ అంటే మాములు కాదు. మ‌రి.. ఇంత భారీ పోటీలోకేసీఆర్ కున్న కాన్ఫిడెన్స్ ఏమిటన్న‌ది చూస్తే ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తాయి.

పేరుకు ఇన్ని పార్టీలు ఉన్నా.. టీజేఎస్‌.. బీజేపీ.. రెండు క‌మ్యునిస్ట్ పార్టీలు.. జ‌న‌సేన‌. . వైఎస్సార్ కంగ్రెస్ పార్టీలు కేసీఆర్ వ్య‌తిరేక ఓట్ల‌ను తీల్చే వీలుంది. అన్నింటికి మించి.. జ‌గ‌న్‌.. ప‌వ‌న్ ల‌కు చెందిన  సామాజిక వ‌ర్గాలు సైతం త‌మ అధినేత‌ల‌కు మేలు క‌లిగేలా ఓట్లు వేసే వీలుంది. దీని కార‌ణంగా వారుఎన్నిక‌ల్లో గెల‌వ‌కున్నా.. కేసీఆర్ ను గెలిపించే విష‌యంలో మాత్రం కీల‌క‌పాత్ర పోషిస్తార‌ని చెప్పాలి. నిజానికి ఇదే కేసీఆర్ ముంద‌స్తు మీద పెట్టుకున్న ధీమాగా చెబుతారు. మ‌రి.. కేసీఆర్ న‌మ్మ‌కాన్ని ప‌వ‌న్‌.. జ‌గ‌న్ లు ఎంత‌మేర నిజం చేస్తారో కాల‌మే బ‌దులివ్వాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు