పెట్రో మంటతో కమలం కాలిపోతుందా...!?

పెట్రో మంటతో కమలం కాలిపోతుందా...!?

దేశంలో పెట్రోలు మంటలు రగిలిస్తోంది. ఈ మంటలు రోజరోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ లీటర్ పెట్రోలు ధర రేపు ఉండడం లేదు. గంట క్రితం ఉన్న డీజిల్ ధర ఇప్పుడు ఉండడం మరో గంటకు మారిపోతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, డాలర్ మారక విలువ మాటిమాటికి దిగజారడమే ఇందుకు కారణమని కేంద్ర ప్రభుత్వం నమ్మబలుతోంది.

ఇందులో వాస్తవం ఎంత ఉంది అన్నది దేవుడికెరుక. ఈ పెట్రోలు ధరల పుణ్యమాని సామాన్య, మధ్య తరగతి మానవులు మాత్రం చితికిపోతున్నారు. పెట్రోలు, డీజిల‌ ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల ధరలు కూడా నానాటి పెరిగిపోతున్నాయి. ఇది సామాన్యులు భరించ లేకపోతున్నారు.

ఇప్పటికే దేశంలో అమ్మాలంటే అడవి... కొనాలంటే కొరివి చందనా మారిప పరిస్ధితుల్లో ఈ పెట్రోలు ధరలు నానాటికీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సామాన్య, మధ్య తరగతి వారినే లక్ష్యంగా చేసుకుని పాలన సాగిస్తోందనే వాదనలు విసిపిస్తున్నాయి. ఇంతకు ముందు పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులను రోడ్డు మీదకు, క్యూ లైన్లలోనూ నిలబెట్టిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ తర్వాత జీఎస్టీ అంటూ మరీ రోడ్డున పడేసిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ఉన్న కాస్త ఊపిరిని తీసేసిందని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.  కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. పెట్రోలు, డీజిల్ ధరలు ఇలాగే పెరిగితే ఆ పెట్రోలే రానున్న ఎన్నికల్లో కమలాన్ని కాల్చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గతంలో ఉల్లిపాయ ధరలు పెంచిన ప్రభుత్వాలనే దేశ ప్రజలు కనికరించలేదని, ఇప్పుడు పెట్రోలు ధరలు ఇలా పెరిగిపోతూ నిత్యావసరాలు చుక్కలను చూపిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, భారతీయ జనతా పార్టీకి ప్రజల సెగ తగలడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.

పెద్ద నోట్ట రద్దు, జీఎస్టీకి తోడు ఇప్పుడు పెట్రోలు కూడా తోడైందని వారంటున్నారు. ఇక కాంగ్రెస్ ఇప్పుటికే పెద్ద అస్త్రంగా భావిస్తున్న రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారం కూడా ముదిరి కమలనాథులకు రానున్న ఎన్నికల్లో పెట్రోలు మంట వారికే తగిలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు