మోదీ స‌ర్కార్ పై స్వ‌రా భాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్!

మోదీ స‌ర్కార్ పై స్వ‌రా భాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్!

త‌న మ‌న‌సులోని అభిప్రాయాన్ని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పే బాలీవుడ్ హీరోయిన్ల‌లో స్వ‌రా భాస్క‌ర్ ఒక‌రు. సినీరంగంతో పాటు సామాజిక అంశాల‌పై కూడా ఈ హాట్ బ్యూటీ త‌న అభిప్రాయాన్ని నిర్భ‌యంగా వెల్ల‌డిస్తుంది.

కొద్ది రోజుల క్రితం క్యాస్టింగ్ కౌచ్ పై త‌న బోల్డ్ కామెంట్స్ తో స్వ‌రా భాస్క‌ర్ అంద‌రికీ షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. వీరే ది వెడ్డింగ్ లో ఆమె నటించిన ఓ స‌న్నివేశంపై కూడా దుమారం రేగింది. తాజాగా, కేంద్ర ప్రభుత్వంపై స్వర భాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

మహాత్మాగాంధీని హత్య చేసిన వారు ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌లు పెనుదుమారం రేపుతున్నాయి. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వారి కేసుల్లో ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

ప్రధాని నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై విరసం నేత వరవరరావుతోపాటు మరో నలుగురు హక్కుల నేతలను పుణె పోలీసులు అరెస్ట్ చేసిన నేప‌థ్యంలో స్వ‌రా భాస్క‌ర్ ఈ వ్యాఖ్య‌లు చేసింది. వారి అరెస్టుల త‌ర్వాత `మీ టూ అర్బ‌న్ న‌క్స‌ల్` అంటూ సోష‌ల్ మీడియాలో జ‌రిగిన ఒక క్యాంపెయిన్ పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ కు స్వ‌రా స్పందించింది. అర్బన్ నక్సల్స్ ను తాను చూశానని, వారు టీవీ చర్చల్లో కనిపిస్తారని, పోలీసుల ఎఫ్ఐఆర్‌లలో ఉంటారని, ఇది చాలా హాస్యాస్పదమని సెటైర్ వేసింది.

ప్ర‌జ‌ల ఆలోచనలను శిక్షించలేరని, ఒకవేళ అలా మ‌నుషుల‌ ఆలోచనలనే అరెస్టులు చేసుకుంటూ పోతే దేశంలోని జైళ్లు సరిపోవని ఎద్దేవా చేసింది. గ‌తంలో మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పుడు చాలామంది పండుగ చేసుకున్నారని, ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారని  సంచలన వ్యాఖ్యలు చేసింది. వారిని అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల‌కు పారిపోతున్న నీర‌వ్ మోదీ లాంటి వారిని వ‌దిలేసి...నిరు పేదల కోసం పోరాడుతున్న వారిని అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తోందని మండిప‌డింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు