తెలంగాణ‌ త‌మిళ‌నాడు రాజ‌కీయం

తెలంగాణ‌ త‌మిళ‌నాడు రాజ‌కీయం

ఆదివారం నాడు జరిగిన ప్రగతి నివేదన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలోని పాలన తెలంగాణ నాయకుల చేతిలోనే ఉండాలని, ఎట్టి పరిస్థితులలోను ఢిల్లీ నాయకుల చేతిలో పెట్టవద్దని కెసిఆర్ అన్నారు.

ఈ విషయమై మనం తమిళ ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలని, వారెప్పుడూ పాలనను ఇతరుల చేతికి ఇవ్వలేదని అన్నారు. ఢిల్లీలోని పార్టీలకు ఓటు వేయద్దంటూ నర్మగర్భంగా కాంగ్రెస్, బిజెపిలను ఉద్దేశించి ప్రజలకు పిలుపు నిచ్చారు. గత నాలుగేళ్ల తమ పాలనలో 465 పథకాలను అమలులోకి తీసుకుని వచ్చామని చెప్పారు. ముందస్తు ఎన్నికలపైనా, శాసనసభ రద్దుకు సంబంధించి తన పార్టీ నాయకులు అన్ని బాధ్యతలు తన పైనే పెట్టారని, త్వరలోనే వీటిపై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తానని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి చాలా నిబద్దత  ఉన్న పార్టీ అని, మన ఉద్యోగాలు మనకే అని నినదించి, 95 శాతం ఉద్యోగాలు లోకల్ పీపుల్ కే దక్కేటట్లు ఆర్డినెన్స్ తీసుకువచ్చానని ఆయ అన్నారు. కేసీఆర్ లేకపోతే 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కేవా అని ఆయ‌న‌ను ఆయ‌న పొగిడేసుకున్నారు. దేశంలో మొత్తం మైనారిటీలకు 4 వేల కోట్లు కేటాయిస్తే ... తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏకంగా 2 వేల కోట్లు కేటాయించిందని, మైనార్టీల పట్ల తమ ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో ఉందో ఇందుకు నిదర్శనం అని ఆయన అన్నారు.

తెలంగాణలోని 22 వేల గ్రామాలకు తాగునీరందించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని, మిగతా గ్రామాలకు మరో వారం, పది రోజులలో  నీరు అందుతుందని ఆయన వాగ్దానం చేశారు. ప్రతి ఇంటికి నీరు అందించాకే తమ పార్టీ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతామని ఆయన అన్నారు.

అయితే, ఇందులో నోట్ చేయాల్సిన పాయింట్లు ఏంటంటే...  త‌మిళ‌నాడు లాగా ప్ర‌జ‌లే జాతీయ పార్టీలు ఎదుర్కొనే వ్యూహాల‌కు నిన్న‌టి స‌భ‌లో  కేసీఆర్ మొద‌టి పిలుపు ఇచ్చారు. త‌ర్వాత ఇది కొన‌సాగే అవ‌కాశం ఉంది.  రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌‌ఎస్ పార్టీ జనరల్ సెక్రేటరీ కె. కేశవ రావు అధ్యక్షతన మేనిఫెస్టో క‌మిటీని వేశాన‌ని చెప్ప‌డం ముందస్తు వాయిదా ప‌డింది గానీ ర‌ద్దు కాలేదు అని చెబుతున్న‌ట్లే. త‌నే స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పిన కేసీఆర్‌... ఏడు రోజుల్లో నీరు ప్ర‌తి గ్రామానికి అందుతాయ‌ని చెబుతుంటే... ఆరోజు ప్రెస్‌మీట్ పెట్టి ప్ర‌భుత్వ ర‌ద్దు ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశ‌మూ క‌నిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు