రేపు ప్ర‌యాణాలు పెట్టుకుంటే మీ ప‌ని అంతే!

రేపు ప్ర‌యాణాలు పెట్టుకుంటే మీ ప‌ని అంతే!

తెలంగాణలో సెప్టెంబర్ 2వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముందస్తుకు పిలుపు ఇవ్వనున్నారు. నగర శివార్లలో కొంగరకలాన్లో  దాదాపు 2000 ఎకరాల్లో జరగనున్న ప్రగతి నివేదన సభలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు హైదరాబాద్ చేరుకోనున్నారు.

దాదాపు లక్ష వాహనాలలో 25 లక్షల మందిని సభా వేదికకు తరలించేందుకు సన్నాహాలు చేశారు. ఖమ్మం నుంచి 1850 ట్రాక్టర్లలో రైతులు హైదారబాద్ బయలుదేరారు. ఇందుకోసం రాష్ట్రంలో  7,500 ఆర్టీసీ బస్సులను ఈ సభకు ప్రజలను తరలించేందుకు వినియోగించనున్నారు.

అయితే ఆర్టీసీ బస్సులకు అద్దె మాత్రం వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి కె, చంద్రశేఖర రావు టీఆర్‌ఎస్ నాయకులను ఆదేశించారు. అంతేకాకుండా వివిధ జిల్లాలకు చెందిని ఆర్టీసీ బస్సులలో 95 శాతం బస్సులను ఈ ప్రగతి నివేదిక సభకు మళ్లిస్తున్నారు.  అత్యవసరమైతే తప్ప అవుటర్ రింగ్ రోడ్డు పైకి రావద్దని పోలిస్ కమీషనర్ ప్రజలకు ఓ ప్రకటనలో చేప్పారు.

అయితే సామాన్య ప్రజలు మాత్రం ప్రయాణాలు మానుకుంటే మంచిదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రగతి నివేదన సభ పేరుతో రాష్ట్రంలోని వాహనాలు సభకు మళ్లిస్తే, ఇక సామాన్యులు రేపు ప్రయాణాలు మానుకోవల్సిందేనా అని ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. హైదారబాదులోని ప్రజలు వారి గమ్యం చేరుకోవాలంటే ఇతర వాహనాలను అంటే షేరింగ్ ఆటోలు వాడుకోవచ్చునని అదే జిల్లాలోని ప్రజల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

గత నాలుగేళ్లగా తమ పార్టీ తన రాష్ట్ర ప్రజలకు ఏమి చేసిందో చెప్పడానికే ఈ ప్రగతి నివేదన సభ అని టీఆర్‌‌ఎస్ నాయకుడు ఒకరు అన్నారు. ప్రజలకు చేసిన మంచి పనులు మనము ఇంత భారీ ఎత్తున సభ పెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదని, చేసిన మంచి ఏదైన ఉంటే వారు తమ ఓట్లు రూపంలో తెలియజేస్తారని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యనిస్తున్నారు. ఓటమి భయంతో ముందస్తుకు వెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సెప్టెంబర్ 2 వ తేదీన సభకు బస్సులను తరలిస్తే, సామాన్య ప్రయాణికుడు ఇబ్బంది తెలంగాణ ముఖ్యమంత్రికి పట్టదా అని వారు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు