టెన్నిస్ కోర్టులో ష‌ర్ట్ విప్పిన ఆమెకు వార్నింగ్‌?

టెన్నిస్ కోర్టులో ష‌ర్ట్ విప్పిన ఆమెకు వార్నింగ్‌?

అనుకోకుండా జ‌రిగిన ఒక ఘ‌ట‌న ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. సోష‌ల్ మీడియాలో భారీ చ‌ర్చ‌కు ఈ ఉదంతం కార‌ణ‌మైంది. యూఎస్ ఓపెన్ లో ఫ్రాన్స్ క్రీడాకారిణి అలిజె కార్నెట్.. స్వీడ‌న్ కు చెందిన జొహ‌న్నాతో త‌ల‌ప‌డుతున్నారు. ఈ సింగిల్స్ మ్యాచ్ మ‌ధ్య‌లో ఎండ తీవ్ర‌త‌తో ఉక్కుపోత‌కు గురైంది అలిజె. మ్యాచ్ మ‌ధ్య‌న ఇచ్చిన ప‌ది నిమిషాల బ్రేక్ స‌మ‌యంలో.. చెమ‌ట‌తో త‌డిచి ముద్ద అయిన త‌న ష‌ర్ట్ ను తీసేసి.. మ‌రో ష‌ర్ట్ వేసుకున‌నారు.

అయితే.. కోర్టులో ష‌ర్ట్ మార్చ‌టం పై ఛైర్ అంపైర్ ఆమెను హెచ్చ‌రించారు. రూల్స్ కు విరుద్ధంగా అలిజె వ్య‌వ‌హ‌రించింద‌ని హెచ్చ‌రించారు. దీనిపై టెన్నిస్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. తీవ్ర‌మైన ఉక్క‌పోత‌తో.. చెమ‌ట‌తో త‌డిచిన వేళ ష‌ర్ట్ మార్చుకోవ‌టం త‌ప్పు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ప్ర‌చారం కోస‌మో మ‌రో కార‌ణం కోస‌మే ఆమె ష‌ర్ట్ తీయ‌లేద‌ని.. ఉక్క‌పోత కార‌ణంగా ఆమె అలా చేస్తే.. దాన్ని కూడాఅలా త‌ప్పు ప‌డ‌తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా చేయ‌ని ప‌నిని త‌ప్పు ఎలా అవుతుంద‌న్న ప్ర‌శ్న‌తో పాటు.. మైదానంలో పురుష ఆట‌గాళ్లు ష‌ర్ట్ విప్పితే లేని త‌ప్పు.. మ‌హిళా క్రీడాకారులు ష‌ర్ట్ విప్పితే త‌ప్పు ఎందుకు అవుతుంది? అని ప్ర‌శ్నిస్తున్నారు. నిజ‌మే.. అది కూడా ఒక పాయింటేగా?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు