రూ.4కోట్లు ఖ‌ర్చు చేశా.. జ‌గ‌న్ పార్టీ నేత బ‌రస్ట్‌!

రూ.4కోట్లు ఖ‌ర్చు చేశా.. జ‌గ‌న్ పార్టీ నేత బ‌రస్ట్‌!

జ‌గ‌న్ పార్టీ నేత ఒక‌రు బ‌ర‌స్ట్ అయ్యారు. త‌న ఆవేద‌న‌ను బ‌య‌ట‌కు చెప్పి సంచ‌ల‌నం సృష్టించాడు. జ‌గ‌న్ చుట్టూ ఉన్న ఆయ‌న సన్నిహిత నేత‌ల అస‌లు రంగును ప్ర‌పంచానికి చెప్ప‌ట‌మే కాదు.. ఇలాంటి నేత‌లా మీ చుట్టూ ఉండేద‌న్న ప్ర‌శ్న‌ను అధినేత‌కు అడ‌గ‌క‌నే అడిగేశారు. ప్ర‌కాశం జిల్లాలో సంచ‌ల‌నంగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వ‌రికూటి అశోక్ బాబు మాట‌లు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి.

కోట్లు ఖ‌ర్చు పెట్టినా పార్టీ ప‌ద‌వి కూడా ద‌క్క‌నివ్వ‌ని వైవీ సుబ్బారెడ్డి ఆరాచ‌కాల‌పై ఆయ‌న గ‌ళం విప్ప‌ట‌మే కాదు.. పార్టీ అధిష్ఠానాన్ని సూటిగా ప్ర‌శ్నించారు. నాలుగేళ్లుగా ఉన్న ఆస్తులు క‌రిగిపోయాయ‌ని.. రూ.4కోట్లు ఖ‌ర్చు పెట్టిన త‌ర్వాత కూడా నాయ‌కుడిగా తాను ప‌నికి రాలేదా? అని ప్ర‌శ్నించారు. మీకు బానిస‌లు కావాల‌ని ఇన్ చార్జ్ ప‌ద‌వి వేరొక‌రికి ఇస్తారా?  ఇది స‌మంజ‌స‌మా? అని ప్ర‌శ్నించారు.

ప్ర‌కాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అంతం చేయ‌టం ద్వారా జ‌గ‌న్ కు చెడు చేస్తున్నార‌న్నారు. ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పొగాకు చెట్టుకు చేటు చేసే పొగ‌మ‌ల్లెలా త‌యార‌య్యార‌ని మండిప‌డ్డారు. అప్పు తెచ్చానో.. ఉన్న‌దే కాజేసుకున్నానో నాలుగు కోట్లు పార్టీ కోసం ఖ‌ర్చు చేసినా ద‌య క‌లుగ‌లేదా? అని ప్ర‌శ్నించారు.

ద‌ళితుల ర‌క్త‌మాంసాల మీద ఎంపీ కోట క‌ట్టుకుంటారా? అని వైవీ సుబ్బారెడ్డిని తీవ్రంగా ప్ర‌శ్నిస్తూ.. ఒక్క ద‌ళితుల‌కే కాదు.. బీసీల‌కు కూడా వైవీ సుబ్బారెడ్డి అన్యాయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంక‌ట‌రెడ్డి ఆస్తులు వైవీ రాయించుకుంటే జ‌గ‌న్ పిలిచి చివాట్లు పెట్టి తిరిగి ఆస్తులు ఇప్పించిన వైనాన్ని బ‌య‌ట‌పెట్టారు.

చీము నెత్తురు ఉంటే ప్ర‌జాక్షేత్రంలోకి వైవీ రావాల‌న్నారు. నాయ‌కుడంటే ప్ర‌కాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డేన‌ని.. డ‌బ్బులు ఉన్నా?  లేకున్నా.. ప్ర‌జాక్షేత్రంలో వాస‌న్న వ‌స్తున్నాడంటే జ‌నం ఉప్పెన‌లా వ‌స్తార‌న్నారు.  జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడిగా ఉండే వైవీ సుబ్బారెడ్డిపై సొంత పార్టీ నేత చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. మ‌రి.. వైవీ సుబ్బారెడ్డి విష‌యంపై జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు