అన్నదమ్ముల మధ్య రాజకీయం

అన్నదమ్ముల మధ్య రాజకీయం

దేవినేని ఉమామహేశ్వరరావు, దేవినేని చంద్రశేఖర్‌రావు అన్నదమ్ములు. దేవినేని ఉమ తెలుగుదేశం నేత అయితే, దేవినేని చంద్రశేఖర్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు నేత. హఠాత్తుగా దేవినేని చంద్రశేఖర్‌, కంచికచర్లలోని టిడిపి ఆఫీసుకు తాళం వేశారు. దీని వెనుక రాజకీయ కోణం ఉందో లేదో ఆ అన్నదమ్ములే చెప్పాలి. బయటకు కనిపిస్తున్నదైతే ఇది కుటుంబ తగాదా, ఆస్తి గొడవ.

ఉమ్మడి ఆస్తులను దేవినేని ఉమ్మ ఒక్కరే అనుభవిస్తున్నారని చంద్రశేఖర్‌ ఆరోపించారు. అందుకే తాళం వేశానని చెప్పారు. ఆస్తి గొడవలుంటే ఇంట్లో చూసుకోవాలి, కోర్టును ఆశ్రయించాలి. అంతేగాని పార్టీ కార్యాలయాలకు తాళం వేయడం ఏం రాజకీయమో చంద్రశేఖర్‌ సమాధానం చెప్పవలసి ఉంటుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు నేత, టిడిపి కార్యాలయానికి తాళం వేశాడంటే అది ఎంత పెద్ద వివాదం. ఇది అన్నదమ్ముల గొడవలా లేదు, పార్టీల మధ్య తగాదాలా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు