హ‌రికృష్ణ‌, ఇద్ద‌రు కొడుకుల‌కూ అదే డేంజ‌ర్ ప్లేస్‌

హ‌రికృష్ణ‌, ఇద్ద‌రు కొడుకుల‌కూ అదే డేంజ‌ర్ ప్లేస్‌

ఎన్డీఆర్‌ కుమారుడు, హీరో, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.   తెలంగాణలోని నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద  ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా తీవ్రగాయాలపాలైన ఆయనను చికిత్స నిమిత్తం నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ  ఆయన మృతి చెందారు.

తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో స్వయంగా హరికృష్ణే కారు డ్రైవ్ చేస్తూ వెళ్లారు. అన్నేపర్తి వద్ద రోడ్డును క్రాస్ చేస్తున్న సమయంలో  అటుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో ప్రమాదం జరిగింది.  ప్రమాదంలో హరికృష్ణ కారు నుంచి ఎగిరి బయటపడిపోయారు. తలకు బలమైన గాయమైంది. ఆయన బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స పొందుతూ ఉదయం ఏడు గంటల సమయంలో  హరికృష్ణ కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు.

కాగా గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయ‌న కూడా అదే దారిలో ప్ర‌మాదానికి గుర‌య్యారు. నంద‌మూరి కుటుంబం అన‌డం కంటే.. హ‌రికృష్ణ కుటుంబానికి ఆ రోడ్డు బ్యాడ్ సెంటిమెంట్‌...లా మారింది. అన్న‌ద‌మ్ములు క‌ళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ ఇద్ద‌రూ ఆ రోడ్డు జ‌ర్నీ ఇక సెంటిమెంట్‌గా అవాయిడ్ చేయాల‌ని అభిమానులు సోష‌ల్ మీడియాలో అపుడే పోస్టులు పెడుతున్నారు.

ఇక హ‌రికృష్ణ ఎంత చ‌క్రం తిప్పాడో ఈ త‌రానికి తెలియ‌దు గాని 90 స్‌లో ఒక సీఎం అంత ప‌వ‌ర్‌ని హ‌రికృష్ణ ఎంజాయ్ చేశారు. ఎన్టీఆర్ ల‌క్ష్మీపార్వ‌తిని క‌లిసే వ‌ర‌కు హ‌రికృష్ణ‌కు తెలియ‌కుండా ప్ర‌భుత్వంలో ఏ ప‌నీ, ఏ నిర్ణ‌యం జ‌రిగేది కాదు. ఎన్టీఆర్ మరణం తరువాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతిలో వెళ్లాక ఆయన విభేదించి అన్న తెలుగుదేశం పార్టీ పెట్టారు. కానీ, ప్రభావం చూపలేకపోవడంతో అనంతరకాలంలో మళ్లీ తెలుగుదేశంలోనే చేరి రాజ్యసభ సభ్యత్వం పొందారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా 2013 ఆగస్టులో ఆయన రాజీనామా చేశారు. ఆ తరువాత రాజకీయంగా ఆయన యాక్టివ్‌గా లేరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు