పరశురామ్ దేవుడి సినిమా

పరశురామ్ దేవుడి సినిమా

పరశురామ్.. ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ షాట్ డైరెక్టర్. మెగా బ్లాక్ బస్టర్ అయిన ‘గీత గోవిందం’ సినిమాతో అతడి రేంజే మారిపోయింది. వంద కోట్లకు పైగా గ్రాస్.. రూ.60 కోట్ల దాకా షేర్ సాధిస్తున్న సినిమాకు దర్శకుడతను. పరశురామ్ ఇప్పటికే విజయాలు సాధించినా ఇలాంటి సక్సెస్ అతడి కెరీర్‌కే తలమానికంగా నిలిచేదే. అతడి కోసం టాలీవుడ్లో చాలామంది నిర్మాతలు, హీరోలు లైన్లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఐతే వరుసగా తన మూడో చిత్రాన్ని కూడా ‘గీతా ఆర్ట్స్-2’ బేనర్‌కే చేయాలని పరశురామ్ ఫిక్సయ్యాడు. ఆ చిత్ర కథ గురించి పరశురామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంకేతాలు కూడా ఇచ్చాడు పరశురామ్.

ఒక వ్యక్తికి దేవుడికి మధ్య సాగే కథతో పరశురామ్ కొత్త సినిమా ఉంటుందట. ఐతే ఇలాంటి కథతోనే వచ్చిన ‘గోపాల గోపాల’ దీనికి ఏమీ సంబంధం ఉండదట. ఇది పూర్తి వినోదాత్మకంగా ఉంటుందట. ఈ సినిమా గురించి పరశురామ్ మరింత వివరిస్తూ.. ‘‘గోపాల గోపాల సినిమాకి నేను చేయబోయే చిత్రానికి అస్సలు పోలిక లేదు. ప్రస్తుతం ఈ స్క్రిప్టు మీదే పని చేస్తున్నాను. మంచి కథకి సరైన క్యారెక్టరైజేషన్స్ సెట్టయ్యాయి. సినిమా మొత్తం ఫుల్ వినోదాత్మకంగా సాగుతుంది. ఒక మనిషికి దేవుడికి మధ్య సాగే ట్రాక్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. స్క్రిప్ట్ బాగా వస్తోంది. కొత్తగా ఉంటుంది. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుంది’’ అని పరశురామ్ తెలిపాడు. ఈ చిత్రానికి పని చేసే నటీనటులు, సాంకేతిక నిపుణులపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని పరశురామ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు