గవర్నర్... కింకర్తవ్యం..!?

గవర్నర్... కింకర్తవ్యం..!?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు న్యూఢిల్లీ కదిపిన పావులు పని చేసాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి సానుకూల స్పందనలు కూడా వచ్చినట్లు సమాచారం. దీంతో ఇక మిగిలింది శాసనసభ రద్దు. ఆపై ఎన్నికల నిర్వహణ. ఈ లోగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తాను ఏం చేయాలని న్యాయ నిపుణులు, ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితుల్లో మీరేం చేశారంటూ మాజీ గవర్నర్లను కోరుతున్నట్లుసమాచారం.

ముందుగా శాసనసభ రద్దు చేసినట్లుగా శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంది. ఆ తీర్మానం చేయాలంటే సభ సమావేశం కావాలి. ఇది సెప్టెంబర్ మొదటి వారంలో జరుగుతుందని అంటున్నారు. సభ ప్రారంభమైన రోజునే ముందు ఇటీవల మరణించిన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రధానులు, ఇతర నాయకుల గౌరవార్ధం సభ సంతాపం తెలియజేస్తుంది.. అనంతరం ఆ రోజుకు సభకు వాయిదా వేసినా ఆ మర్నాడు తిరిగి సభ సమావేశమై శాసనసభను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటిస్తుంది. ఆ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా గవర్నర్ కు పపుతారు. ఆ ప్రతి ఆయనకు చేరిన మరుక్షణం నుంచే గవర్నర్ పని ప్రారంభమవుతుంది.

రాష్ట్రంలో మెజార్టీలో ఉన్న ప్రభుత్వం ఈ తీర్మానం చేసినందున దీన్ని గవర్నర్ ఆమోదించక తప్పదు. గవర్నర్ దీనిపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం, అవకాశం కూడా ఉండదు. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు గవర్నర్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం. సభ రద్దు అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించవచ్చు. అయితే అది కూడా ప్రతిపక్షానికి సరైన మెజార్టీ ఉంటేనే. తెలంగాణలో అది లేదు కనుక ఇక సభ రద్దుకు గవర్నర్ తప్పక ఆమోద ముద్ర వేయాలి.

తిరిగి ఎన్నికలు జరిగి ఏదో ఒక పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్నాటు చేసే మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి వచ్చిందో వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. ఈ లోగా రాష్ట్రంలో ఆపధర్మ ప్రభుత్వాన్ని నడపాల్సిందిగా గవర్నర్ ప్రస్తుత ముఖ్యమంత్రేనే కోరవచ్చు. తెలంగాణ విషయంలో కూడా ఇదే జరుగుతుందని న్యాయనిపుణులు అంటున్నారు. మాజీ గవర్నర్‌లు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెబుతున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English