ప‌దేళ్లలో ట్రిలియ‌న్ డాల‌ర్ల రాష్ట్రంగా ఏపీ

ప‌దేళ్లలో ట్రిలియ‌న్ డాల‌ర్ల రాష్ట్రంగా ఏపీ

ఇవాల్టి రాజ‌కీయ రంగంలో దూర‌దృష్టి క‌ల నాయ‌కులు చాలా త‌క్కువ‌గా ఉంటారు. వ‌జ్ర సంక‌ల్పంతో త‌ప‌స్సు చేసిన‌ట్లుగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్ర‌య‌త్నించే అధినేత‌లు అంతంత‌మాత్రంగా ఉన్న వేళ‌.. ఏపీకి కొత్త శ‌క్తిగా.. స‌రికొత్త ఆశ‌గా నిలిచారు సీఎం చంద్ర‌బాబు.

ఒక ముఖ్య‌మంత్రి పిలుపునిస్తే రాజ‌ధాని కోసం 35వేల ఎక‌రాల భూమిని రైతులు స్వ‌చ్ఛందంగా ఇవ్వ‌టం దేశ చ‌రిత్ర‌లో ఎక్క‌డైనా చూశామా?  ఇవాల్టి రోజున అది సాధ్య‌మా? అంటే.. నో అనేస్తారు. కానీ.. ప‌క్కా ప్లానింగ్ తో త‌న‌మీద ప్ర‌జ‌ల్లో ఉన్న‌న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా రైతుల ఆశ‌ల్ని.. ఆంధ్రుల క‌ల‌ల్ని సాకారం చేసేందుకు వీలుగా రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని నిర్మించేందుకు స‌రికొత్త రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు చంద్ర‌బాబు.

తాజాగా ముంబ‌యిలోని సెరిమోనియ‌ల్ బెల్ మోగించి అమ‌రావ‌తి బాండ్ల లిస్టింగ్‌ను ప్రారంభించారు. అమ‌రావ‌తి బాండ్లు లిస్ట్ కావ‌టం సంతోషంగా ఉంద‌న్న ఆయ‌న‌.. 217 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల ప‌రిధిలో రాజ‌ధాని నిర్మాణం సాగుతుంద‌ని చెప్పారు. ప‌ర‌పంచంలోనే అతి పెద్ద ల్యాండ్ పూలింగ్ ప్ర‌క్రియ ఏపీలోనే జ‌రిగింద‌న్నారు.

వాక్ టు వ‌ర్క్ అన్న‌ది అమ‌రావ‌తి నినాదంగా చెప్పిన ఆయ‌న స‌న్ రైజ్ ఏపీగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి పేరు పెట్టిన‌ట్లుగా వెల్ల‌డించారు. రాజ‌ధాని క‌ల‌ను నిజం చేసేందుకు ప్ర‌పంచ స్థాయి సంస్థ‌ల‌తో క‌లిసి ప‌ని చేస్తున్న‌ట్లుగా ఆయ‌న వెల్ల‌డించారు. ఆగ‌స్టు14న అమ‌రావ‌తి బాండ్లు ట్రేడ్ అయ్యాయ‌ని.. కేవ‌లం గంట వ్య‌వ‌ధిలో రూ.2వేల కోట్లు తాము ఆర్జించిన‌ట్లు వెల్ల‌డించారు. 44 నెల‌లుగా రాజ‌ధాని నిర్మాణం వేగంగా సాగుతుంద‌న్న బాబు.. త‌న‌పై ఉన్న విశ్వాసంతో సింగ‌పూర్ ఒక్క రూపాయి తీసుకోకుండా మాస్ట‌ర్ ప్లాన్ ఇచ్చింద‌ని చెప్పారు.

మ‌రో ప‌దేళ్లు 2029 నాటికి ప్ర‌పంచంలో ఐదో అత్యుత్త‌మ న‌గ‌రంగా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని నిర్మించ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. ప‌దేళ్ల నాటికి ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ల విలువ క‌లిగిన రాష్ట్రంగా ఏపీ మారుతుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఐటీ రంగంలో భార‌త్ నుంచి ముగ్గురు ఉంటే.. వారిలో ఒక‌రు ఏపీ నుంచి ఉంటార‌న్న విష‌యాన్ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు