న‌గ్నంగా పెళ్లి కుమార్తెగా మోడ‌ల్ ఫోటో వివాదం!

న‌గ్నంగా పెళ్లి కుమార్తెగా మోడ‌ల్ ఫోటో వివాదం!

అంద‌రి బాట‌లో న‌డిస్తే ప్ర‌త్యేక‌త ఏముంటుంది?  మిగిలిన వారికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే వ‌చ్చే మైలేజీనే వేరు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వివాదాల్లో మునిగితేలితే వ‌చ్చే మైలేజీ అంతా ఇంతా కాదు. ఇవాల్టి రోజున ఎవ‌ర్ని ఎవ‌ర‌న్నా ఊరుకోవ‌టం లేదు. ప్ర‌తి విష‌యం సున్నితంగా మారిపోయిన ప‌రిస్థితి. పాత‌కాలం నాటి సామెత‌ల్లో కులం పేరుతో ఉన్న వాటిని ఉప‌యోగించినా.. ఆయా సంఘాలు క‌స్సుమంటున్నాయి.

ఇలా ఎవ‌రికి వారు వారి ప‌రిధుల విష‌యంలో క‌చ్ఛితంగా ఉండ‌టం.. ఎవ‌రు త‌మ మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించినా స‌హించేది లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కాసింత క‌ళాత్మ‌కంగా ఫోటోలు తీయ‌టం ద్వారా కొత్త ఇమేజ్ ను సొంతం చేసుకోవాల‌న్న ఒక మోడ‌ల్ కు కొత్త త‌ల‌నొప్పి మొద‌లైంది. పెళ్లికుమార్తెగా ఫోటో షూట్ చేసిన ఒక మోడ‌ల్ కు ప్రాణాలు తీస్తామ‌ని బెదిరింపులు మొద‌ల‌య్యాయి.

ఏంది?.. పెళ్లికుమార్తెగా ఫోటో షూట్ చేస్తే చంపుతారా?  ఇదేం పోయేకాలమ‌ని తిట్టుకోవ‌ద్దు. ఎందుకంటే.. అస‌లు కార‌ణం వేరే ఉంది మ‌రి. పెళ్లికుమార్తెగా ఫోటోలు దిగితే బాగుండేది. కానీ.. పెళ్లికుమార్తెగా త‌యారై న‌గ్నంగా ఫోటోలు దిగ‌టంపై సంప్ర‌దాయవాదులు మండిప‌డుతున్నారు. ప‌శ్చిమ‌బెంగాల్ లో చోటు చేసుకున్న ఈ వివాదం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

బెంగాల్‌కు చెందిన ప్రీత‌మ్ మిత్రా పెళ్లికుమార్తె బ్యాక్ డ్రాప్ లో ఒక ఫోటో షూట్ చేశారు. అయితే.. స్థానిక సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి కుమార్తె నెత్తిన కిరీటం పెట్టి.. నుదుట‌న పెద్ద బొట్టు పెట్టి న‌గ్నంగా ఫోజులతో ఫోటోలు తీశారు. ప్రైవేటు పార్ట్స్ క‌నిపించ‌కుండా కుంకుమ భ‌రిణెతో క‌వ‌ర్ చేశారు. కొత్త‌గా ఉన్న ఈ ఫోటోల్ని త‌న ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారా మోడ‌ల్. అంతే.. సంప్ర‌దాయ‌వాదులు మండిప‌డ‌ట‌మే కాదు.. ఫోటోను కానీ 24 గంట‌ల్లో తొల‌గించ‌కుంటే ప్రాణాలు తీస్తామ‌ని బెదిరిస్తున్నార‌ట‌. వినూత్న ఫోటో షూట్ ను హ్యాపీగా చేసిన మోడ‌ల్ కు పేరు త‌ర్వాత ప్రాణాల మీద‌కు రావ‌టం ఇప్పుడామెను భ‌యాందోళ‌న‌ల‌కు గురి అవుతోంద‌ట‌. వివాదాల నిప్పుతో చెల‌గాటం ఆడాల‌నుకుంటే ఇలాంటి తిప్ప‌లు త‌ప్ప‌వు మ‌రి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు