ప‌వ‌న్ కు పంచ్ వేసిన బాబు!

ప‌వ‌న్ కు పంచ్ వేసిన బాబు!

త‌న‌పై విమ‌ర్శ‌లు చేసినా పెద్ద‌గా రియాక్ట్ కాన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

నాలుగేళ్ల‌ పాటు బాబు పాల‌నను పొగిడిన  ప‌వ‌న్ క‌ల్యాణ్.. జ‌న‌సేన ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా తొలిసారి విమ‌ర్శ‌లు సంధించారు. అప్ప‌టి నుంచి ప్ర‌తి సంద‌ర్భంలోనూ బాబు పాల‌న‌పై  విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

గ‌తంలో బాబు పాల‌న గురించి గొప్ప‌గా.. ఆయ‌న అనుభ‌వం ఏపీకి మేలు చేస్తుంద‌న్న‌ట్లుగా మాట్లాడిన ప‌వ‌న్‌.. త‌ర్వాతి కాలంలో అందుకు భిన్నంగా ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప‌వ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌పై ఆచితూచి అన్న‌ట్లే స్పందిస్తున్నారు చంద్ర‌బాబు. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యారు.

ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్నే అస్త్రాలుగా చేసుకున్న ఆయ‌న తాజాగా జ‌న‌సేనాధిప‌తిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌పై కుట్ర‌లు చేసేందుకే కొత్త పార్టీలు పెట్టిస్తున్నార‌న్న ఆయ‌న‌.. ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న తెచ్చారు.

జ‌న‌సేన అధినేత‌కు తాను మొన్న‌టి వ‌ర‌కూ చాలా బాగా అనిపించాన‌ని.. ఇప్పుడు మాత్రం ఆయ‌న కూడా త‌న‌ను విమ‌ర్శిస్తున్నాడ‌ని చెప్పారు. ఏపీకి కేంద్రం రూ.75వేల కోట్లు ఇవ్వాల‌ని నిపుణుల క‌మిటీ పెట్టి తేల్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు ఆ విష‌యాన్ని ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని సూటిగా ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ మాట‌ల్నే ఆయుధంగా మార్చుకొని ఆయ‌న‌పైనే విమ‌ర్శ‌లు చేసిన చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేనాధినేత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు