కారు యాక్సిడెంట్ తో దొరికిపోయిన జీవీఎల్

కారు యాక్సిడెంట్ తో దొరికిపోయిన జీవీఎల్

నీతులు చెప్పే వారు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. కానీ.. అలాంటి ప‌ని చాలామంది ప్ర‌ముఖులు చేయ‌క చిక్కుల్లో ప‌డుతుంటారు. తాజాగా ఆ జాబితాలోకి చేరారు బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు. తెలుగోడిగా.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్య‌క్తిగా చెప్పుకునే ఆయ‌న‌.. ఏపీ ప్ర‌యోజ‌నాల కంటే బీజేపీ రాజ‌కీయ‌ప్ర‌యోజ‌నాలే ఎక్కువ‌.

ఏ రోజూ కూడా ఏపీకి సంబంధించిన వ్య‌వ‌హారాల మీదా..రాష్ట్ర ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించిన రికార్డు ఎక్క‌డా క‌నిపించ‌ద‌ని ఆయ‌న్ను త‌ప్పు ప‌ట్టే నేత‌లు చెబుతుంటారు. త‌ర‌చూ ఏపీ అధికార‌ప‌క్ష నేత‌ల‌పై ఘాటైన విమ‌ర్శ‌లు చేయ‌టం ద్వారా వార్త‌ల్లోకి వ‌చ్చే ఆయ‌న‌.. తాజాగా మాత్రం అందుకు భిన్న‌మైన వ్య‌వ‌హారంలో ఆయ‌న పేరు వినిపించింది.

గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టించే సంద‌ర్భంగా వాయు వేగంతో వెళుతున్న ఆయ‌న కారు కార‌ణంగా ఒక‌రు మ‌ర‌ణించ‌గా.. మ‌రొక‌రు తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో జీవీఎల్ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌తి విష‌యానికి విచార‌ణ జ‌రిపించాల‌ని కోరే బీజేపీ ఎంపీ జీవీఎల్.. త‌న కారు చేసిన‌ యాక్సిడెంట్ మీదా విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేశారు.

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లం నుంచి వేరే కారులో వెళ్లిపోయార‌ని ఆరోపించారు. ఇప్ప‌టికే జీవీఎల్ కారు మీద అత్యంత వేగంగా కారు న‌డిపిన కేసులు న‌మోదై ఉన్న విష‌యాన్ని వెల్ల‌డించారు. జీవీఎల్ కారు చేసిన యాక్సిడెంట్ కార‌ణంగా మ‌ర‌ణించిన మ‌హిళ కుటుంబానికి రూ.50ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

ప్ర‌త్య‌క్ష సాక్ష్యుల ప్ర‌కారం.. ప్ర‌మాదం జ‌రిగిన కాసేప‌టి వ‌ర‌కూ ఘ‌ట‌నాస్థ‌లంలోనే జీవీఎల్ ఉన్నార‌ని.. త‌ర్వాత మ‌రో కారులో ఆయ‌న వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. యాక్సిడెంట్ చేసిన కారుపై గ‌తంలో చాలానే కేసులు (ప‌రిమితి మించిన వేగంతో ప్ర‌యాణించిన‌) ఉండ‌టాన్ని ప‌లువురు తప్పు ప‌డుతున్నారు. ఒక‌వేళ ఈ ఆరోప‌ణ నిజ‌మైతే.. జీవీఎల్ బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. త‌న మాట‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల్ని ఇబ్బంది పెట్టే జీవీఎల్ కు.. ఆయ‌న సొంత కారు ఆయ‌న్ను చిక్కుల్లో ప‌డేయ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు